Breaking News

పాపం మెలోనీ! అటు ట్రంప్‌.. ఇటు ఎర్డోగాన్‌

Published on Tue, 10/14/2025 - 12:15

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని సోషల్‌ మీడియా ఇప్పుడు పాపం అంటోంది. అందుకు ఈజిప్ట్‌ శర్మ్‌ షేక్‌-ఎల్‌ నగర వేదికగా జరిగిన గాజా శాంతి సదస్సు కారణం. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమె అందంగా గురించి బాహాటంగా వ్యాఖ్య చేయడంతో ఆమె కాస్త ఇబ్బందికి గురైనట్లు కనిపించారు. అదే సమయంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆమె వ్యక్తిగత అలవాటు చేసిన సంభాషణ సోషల్‌ మీడియాకు ఎక్కింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. 

అమెరికాలో ఓ మహిళను నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పడం.. ప్రమాదకరం. ఒకరకంగా అలా కామెంట్‌ చేయడం.. రాజకీయ ప్రస్థానాన్ని ముగించినట్లే. కానీ, నేను ఆ ప్రమాదాన్ని పట్టించుకోను. మీరు అందంగా ఉన్నావ్‌ అని చెబితే ఏమీ అనుకోవు కదా అంటూ వెనక్కి తిరిగి మెలోనీని చూస్తూ ట్రంప్‌ అన్నారు. దీంతో ఆమె సిగ్గుపడుతూ థ్యాంక్స్‌ చెబుతూ.. గుటకలు మింగారు. అలాగే.. 

ఇంకోవైపు.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో జరిగిన సంభాషణా వైరల్‌ అవుతోంది. విమానం నుంచి దిగుతున్నప్పుడు నిన్ను చూశాను. బాగా కనిపిస్తున్నావు. కానీ నీ చేత పొగతాగడం ఆపించాలి అని అన్నారాయన. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమానుయేల్ మాక్రోన్ అది అసాధ్యం అంటూ జోక్‌ పేల్చారు. అయితే.. అది తనకు తెలుసని.. పొగ తాగడం ఆపేస్తే తాను నలుగురితో కలవలేనని అంటూ ఆమె నవ్వుతూనే బదులిచ్చారామె. 

ఇదిలా ఉంటే.. 48 ఏళ్ల మెలోనీకి స్మోకింగ్‌ అలవాటు ఉందనేది బాహాటంగా తెలిసిన విషయమే!. గతంలో తాను రాసిన పుస్తకాల్లోనూ ఆమె ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాదు.. ప్రపంచ నాయకులతో ఇంటెరాక్షన్‌ కోసం ఆ అలవాటు ఎంతో పనికి వచ్చిందని, ట్యూనీషియా అధ్యక్షుడు కైస్‌ సయీద్‌తో కలిసి స్మోక్‌కూడా చేస్తానని ఆమె తెలిపారు. మరోవైపు.. 

టర్కీని ధూమపాన రహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎర్డోగాన్‌ కార్యచరణ రూపొందించారు. 2028 నాటికల్లా ఆ దేశాన్ని అలా తీర్చిదిద్దాలని ఆయన భావిస్తున్నారు.

ఇదీ చూడండి: బాబోయ్‌.. ఇదేం భజన?: పాక్‌ పీఎం పొగడ్తలకు మెలోనీ రియాక్షన్‌

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)