Breaking News

నెతన్యాహుకు భారీ షాకిచ్చిన ట్రంప్‌

Published on Wed, 11/04/2026 - 07:50

ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం.. మరోవైపు దేశంలో అధికారం చేజారే పరిస్థితి.. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా నుంచి అందే ఆర్థిక అండకూ గండం.. ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహుకు వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్న అమెరికా.. ఇకపై ఏటా అందించే సాయాన్ని నిలిపివేస్తామంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఆయుధాలు కావాలంటే అమ్ముతాం కానీ.. ఉచితంగా మాత్రం డబ్బులివ్వబోమన్న సంకేతాలిచ్చారు.

అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌కు ఏటా సుమారు 4 బిలియన్ డాలర్ల ఆర్థిక, సైనిక సాయాన్ని ఈ ఏడాది చివరి నుంచి నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కొన్ని నెలల క్రితమే ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఇజ్రాయెల్ ఇప్పుడు ఆర్థికంగా బలమైన దేశమని, అమెరికా సాయం లేకుండానే తన రక్షణ అవసరాలను తీర్చుకోగలదని అభిప్రాయపడ్డారు. అయితే ఇజ్రాయెల్‌కు అవసరమైతే అండగా ఉంటామని, అమెరికా ఆయుధాలను మాత్రం కొనుగోలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్‌కి చెందిన ‘ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్‌’ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో నేరుగా ఆర్థిక సాయం నిలిపివేసినా.. సైనిక పరంగా ఇజ్రాయెల్‌తో సంబంధాలను కొనసాగించనున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు.

అయితే ఒప్పందం గడువు సంగతేంటి?
ట్రంప్ ప్రకటనపై మరో కీలక ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉన్న అవగాహన ఒప్పందం (MOU) ప్రకారం.. 2019 నుంచి 2028 సెప్టెంబర్ వరకు ఏటా 3.8 బిలియన్ డాలర్ల సైనిక సాయం అందించాల్సి ఉంది. అలాంటప్పుడు ఈ ఏడాది డిసెంబర్ నాటికే ఆ సాయాన్ని ఎలా నిలిపివేస్తారనే విషయాన్ని ట్రంప్ వివరించలేదు. మరోవైపు 2027 రక్షణ బడ్జెట్ ప్రతిపాదనల్లో ఇరు దేశాల మధ్య రక్షణ సాంకేతిక సహకారాన్ని మరింత పెంచే అంశాలు కూడా ఉన్నాయి.

నెతన్యాహుపై ఇజ్రాయెల్‌లో విమర్శలు
ట్రంప్ ప్రకటన ఇజ్రాయెల్ రాజకీయాల్లోనూ కలకలం రేపింది. నెతన్యాహుకు ప్రత్యర్థిగా ఉన్న గడి ఐసెన్‌కాట్ ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించారు. అమెరికాతో వ్యూహాత్మక సంబంధాల్లో ఇంతటి కీలక మార్పు చోటుచేసుకుంటుంటే.. ఇజ్రాయెల్ భద్రతా వ్యవస్థకు, ప్రజలకు మీడియా ద్వారానే విషయం తెలియడం నెతన్యాహు పాలనా తీరుకు నిదర్శనమని విమర్శించారు. ఈ పరిణామం నెతన్యాహుకు రాజకీయంగా పెద్ద సవాలుగా మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలున్నప్పటికీ.. సొంత దేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి, ప్రతిపక్షాల ఒత్తిడి ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. ఇలాంటి సమయంలో అమెరికా ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తామన్న ట్రంప్ ప్రకటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎన్నికల ఫలితాలే కారణమా?
అయితే, ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు కూటమికి మెజారిటీ రాకపోవడమే ట్రంప్ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఇక, ఎన్నికల్లో నెతన్యాహుకు ఎదురైన రాజకీయ సవాళ్లు, అమెరికాలో ఇజ్రాయెల్‌కు మద్దతుపై పెరుగుతున్న విమర్శలు.. ఈ రెండూ ఆయన పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. అందుకే ట్రంప్ ప్రకటనను కేవలం ఆర్థిక నిర్ణయంగా కాకుండా అమెరికా అంతర్గత రాజకీయాలు, ఇజ్రాయెల్‌లో అధికార పోరు, మారుతున్న ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో చూడాల్సి ఉంటుంది. 

ఇదీ చదవండి: ట్రంప్‌ ఎత్తులకు కోర్టు చెక్‌!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)