Breaking News

ఏఐ: సానుకూలం సగం.. ఆందోళన అధికం

Published on Wed, 02/25/2026 - 11:54

వాషింగ్టన్: సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో నేటి  యువత ముందుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంలో అమెరికాలోని టీనేజర్లు ఆసక్తికర ధోరణిని ప్రదర్శిస్తున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సు గల యువతలో దాదాపు 64 శాతం మంది చాట్‌జీపీటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ వంటి ఏఐ చాట్‌బాట్‌లను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకున్నారు.

కేవలం వినోదం కోసమే కాకుండా, సమాచార సేకరణ, పాఠశాల హోంవర్క్, కంటెంట్‌ను క్లుప్తీకరించడం వంటి పనుల కోసం యువత ఏఐపై ఆధారపడుతున్నారు. వచ్చే రెండు దశాబ్దాలలో ఏఐ తమ వ్యక్తిగత జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతుందని 36 శాతం మంది ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చదువులో ఏఐ ఒక శక్తివంతమైన సాధనంగా మారుతుందని వారు భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కొంతమంది టీనేజర్లు ఏఐ వల్ల విశ్లేషణాత్మక ఆలోచనా శక్తి  క్షీణించే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు తగ్గే అవకాశం ఉందన్న ఆందోళనను కూడా వ్యక్తం చేస్తున్నారు.

సామాజికంగా చూస్తే 31 శాతం మంది ఏఐ వల్ల మేలు జరుగుతుందని భావిస్తుండగా, 26 శాతం మంది ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చని  అంటున్నారు.
చదువుల విషయంలో ఏఐ ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. సుమారు 51 శాతం మంది విద్యార్థులు తమ అకడమిక్ అవసరాల కోసం చాట్‌బాట్‌ల సహాయం తీసుకుంటున్నారు. గణిత సమస్యల పరిష్కారం నుంచి వ్యాస రచన వరకు ఏఐ వినియోగం విస్తరించింది. అయితే, ఏఐను కేవలం సహాయకారిగా మాత్రమే కాకుండా, పరీక్షల్లో కాపీ కొట్టడానికి (Cheating) వినియోగిస్తున్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.

59 శాతం మంది విద్యార్థులు తమ తోటివారు ఏఐ సహాయంతో మోసాలకు పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల అవసరాలు ఎలా ఉన్నప్పటికీ, తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి మాత్రం భిన్నంగా ఉంది. సమాచార సేకరణకు ఏఐను అనుమతించే 80 శాతం మంది తల్లిదండ్రులు, వ్యక్తిగత విషయాల్లో లేదా భావోద్వేగ మద్దతు కోసం ఏఐపై ఆధారపడటాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కేరళ ‘కేరళం’.. బెంగాల్‌ ‘బంగో’ అయ్యేదెన్నడు?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)