Breaking News

పుతిన్‌ను అరెస్టు చేస్తే.. రష్యాతో యుద్దం తప్పదు: సౌతాఫ్రికా అధ్యక్షుడు

Published on Wed, 07/19/2023 - 20:24

ఆగష్టులో జొహానెస్‌బర్గ్‌ వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సు జరగనుంది. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరుకానున్నారు. ఈ ఏడాది మార్చిలో పుతిన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీసీ) అరెస్టు వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఐసీసీ సభ్య దేశంగా ఉన్న దక్షిణాఫ్రికా పుతిన్‌ను అరెస్టు చేయాల్సి ఉంటుంది. దీంతో పుతిన్ అరెస్టు విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పుతిన్‌ను అరెస్టు చేస్తే రష్యాతో యుద్ధం తప్పదని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమపోసో అన్నారు. 

బ్రిగ్స్ సమావేశం నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు వస్తున్న రష్యా అధ‍్యక్షుడు పుతిన్‌ను అరెస్టు చేయాలని  ఆ దేశ  ప్రతిపక్ష డెమోక్రటిక్‌ అలయెన్స్ అక్కడి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. కోర‍్టులో విచారణ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో పుతిన్‌ను అరెస్టు చేస్తే రష్యాతో యుద్ధం ప్రకటించినట్లేనని రమఫొస పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం చేయడం దక్షిణాఫ్రికా రాజ్యాంగానికి విరుద్ధమని కోర్టుకు తెలిపారు. మరోవైపు బ్రిక్స్ దేశాల వేదికను తమ దేశం నుంచి మార్చాలన్న ప్రతిపాదనను ఆయా దేశాలు తిరస్కరించినట్లు దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పౌల్‌ మషతిలే తెలిపారు.

గత కొన్నాళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం దురాక్రమణమని పలు దేశాలు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఐక్యరాజ్య సమితి నియమాలకు విఘాతం కలిగిస్తోందని తెలుపతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అరెస్టు చేయాలని కోరాయి. ఆ తర్వాత ఐసీసీ ఆయనపై అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని విరమించాలని పలు దేశాలు కోరుతున్నాయి.  

ఇదీ చదవండి: మండుతున్న ధరలు, ఆస్తులు అమ్ముకుంటున్న పాకిస్తాన్‌.. పరిస్థితి కష్టమేనంటున్న ఐఎంఎఫ్ నివేదిక

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)