Breaking News

రూ. 114 కూలీ : ఇపుడు రూ.1.80 లక్షల కోట్ల కంపెనీ

Published on Sat, 10/31/2026 - 15:33

Hurun Richest Women in China 2026  : ఆమె చిన్నతనంలోనే చదువుకు స్వస్తి చెప్పి, రోజుకు కేవలం  రూ.100 కూలీ నుంచి . చైనాలో అత్యంత ధనవంతురాలైన మహిళా వ్యాపారవేత్తగా ఎదిగింది. నేడు  లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా  తన ప్రత్యేకతను చాటుకుంటోంది.  ఫ్యాక్టరీ కార్మికురాలిగా జీవితాన్ని ప్రారంభించి, ఆ తర్వాత పారిశ్రామికవేత్తగా మారిన  56 ఏళ్ల  జౌ ఖున్‌ఫీ (Zhou Qunfei) సక్సెస్‌ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

చైనాకు చెందిన  జౌ  అత్యంత సాధారణ స్థితినుంచి అపార సంపదతో  రిచెస్ట్‌ విమెన్‌గా నిలిచిన తీరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. 1970లో హునాన్ ప్రాంతంలో జన్మించిన జౌ కుటుంబ పరిస్థితుల కారణంగా టీనేజ్‌లోనే బడి వదిలేయాల్సి వచ్చింది. అనంతరం షెన్‌జెన్‌లోని ఒక వాచ్‌గ్లాస్ తయారీ కర్మాగారంలో రోజుకు సుమారు రూ. 114 వేతనానికి కార్మికురాలిగా పనిచేసేవారు.

'లెన్స్ టెక్నాలజీ' స్థాపన
అక్కడ సాధించిన అనుభవంతో 23 ఏళ్ల వయస్సులో అడ్వాన్స్‌డ్‌ స్క్రీన్-ప్రింటింగ్, కర్వ్డ్-గ్లాస్ తయారీ మెళకువలు నేర్చుకుని సొంతంగా గ్లాస్ ప్రాసెసింగ్ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. సొంతంగా ఒక చిన్న గ్లాస్ ప్రాసెసింగ్ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. తరువాతి  క్రమంలో  ఆ చిన్న వర్క్‌షాపే  'లెన్స్ టెక్నాలజీ'గా మారింది. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ గ్లాస్ తయారీలో తన ప్రతిభను చాటుకుంటూ టాప్‌ ప్లేస్‌లోకి దూసుకొచ్చింది. ముఖ్యంగా 2007లో ఐఫోన్ల మొదటి మోడల్ కోసం ప్రొటెక్టివ్ గ్లాస్ కవర్లు అందించే పెద్ద కాంట్రాక్ట్ లభించడమే ఈమె వ్యాపార జీవితంలో అతిపెద్ద మలుపు. అక్కడి నుంచి వ్యాపారం అనూహ్యంగా పుంజుకుంది. 'లెన్స్ టెక్నాలజీ' సంస్థ స్మార్ట్‌ఫోన్ గ్లాస్ స్క్రీన్‌లను తయారు చేసే అగ్రగామి సంస్థలలో ఒకటిగా ఎదిగింది.

తాజాగా లెన్స్ టెక్నాలజీ వ్యవస్థాపకురాలైన జౌ ఖున్‌ఫీ, సుమారు 127 బిలియన్ యువాన్ల (సుమారు రూ.1.80 లక్షల కోట్లు) సంపదతో మళ్లీ చైనాలో అత్యంత ధనవంతురాలిగా అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. 2015 మార్చిలో షెన్‌జెన్ స్టాక్ మార్కెట్‌లో లెన్స్ టెక్నాలజీ లిస్టింగ్‌ తరువాత జౌ ఖున్‌ఫై తొలిసారి చైనాలోనే అత్యంత ధనిక మహిళగా నిలిచారు.

2018లో యూఎస్-చైనా వాణిజ్య యుద్ధం,  యాపిల్ విక్రయాల మందగమనం వల్ల కంపెనీ షేర్ల ధరలు బాగా పడిపోయాయి. వ్యాపార విస్తరణ నిధుల కోసం హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో  2025లో  రెండోసారి  లిస్టింగ్ సాధించారు. అలాగే తన వ్యాపారిన్ని కేవలం స్మార్ట్‌ఫోన్లకే పరిమితం కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హార్డ్‌వేర్, రోబోటిక్స్ రంగానికి విస్తరించారు.

గ్లోబల్‌  గుర్తింపు 
బీజింగ్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఏర్పాటు చేసిన అధికారిక విందులో జౌ ఖున్‌ఫైకి ప్రత్యేక ప్రాధాన్యత లభించింది. ఈ విందులో ఆమె యాపిల్ సీఈఓ టిమ్ కుక్ మరియు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ల మధ్య కూర్చున్నారు.

'ది ఇండిపెండెంట్' నివేదిక ప్రకారం, అక్టోబర్ 28న విడుదలైన 'హురున్ చైనా రిచెస్ట్ ఉమెన్' (Hurun Richest Women in China) జాబితాలో, గత ఏడాదితో పోలిస్తే ఆమె సంపద 15 శాతం పెరిగింది. హాన్‌సో ఫార్మాస్యూటికల్ వ్యవస్థాపకురాలు జంగ్ హుయిజువాన్‌ను అధిగమించి, చైనాలోనే అత్యంత సంపన్నురాలైన మహిళగా జౌ ఖున్‌ఫీ నిలిచారు. హురున్ నివేదిక ప్రకారం చైనాలోని టాప్ 50 ధనిక మహిళల్లో దాదాపు 65శాతం మంది స్వయంకృషితో పైకి వచ్చిన వారే కావడం గమనార్హం.

ఇదీ చదవండి: 5 స్టార్‌ హోటల్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో షాక్‌ : ఇద్దరు విదేశీయులు దుర్మరణం

Videos

ఆత్మకూరులో అర్థరాత్రి ఖాళీగా బ్యాలెట్ బాక్సులు... అసలు ఏం జరుగుతుంది

ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. కాళ్లు తొలగించే ఆలోచనలో డాక్టర్లు

దారుణం..ఇదేనా మానవత్వం అంటే..?

రిగ్గింగ్ చేస్తా నా కొడ*** ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడు బరితెగింపు వ్యాఖ్యలు

తెలంగాణపై అమిత్ షా గురి.. చిరంజీవి, రామ్ చరణీతో భేటీ

ఏపీకి బిగ్ అలర్ట్.. ముంచుకొస్తున్న మురసు తుఫాన్

బెంగళూరు హాస్పిటల్‌కి చేరుకున్న వైఎస్ జగన్

ఏకంగా ఒక రంపం తీసుకుని... బాలిక ఘటనపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందులలో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్...

రాప్తాడు బాలిక ఘటన పై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

'సీన్' కోసం నజ్రియా బిజీ బిజీగా (ఫొటోలు)

+5

ఆషిక నవ్వితే నక్షత్రాలు మెరిసినట్లే (ఫొటోలు)

+5

మాల్దీవుల్లో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (ఫొటోలు)

+5

జిమ్-ఫుడ్-ఫ్యామిలీ.. అనసూయ అక్టోబర్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)