Breaking News

పాక్‌లో మరో ఘోరం.. ఎవరీ సనా యూసఫ్‌?

Published on Wed, 06/04/2025 - 08:34

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో మరో ఘోరం చోటు చేసుకుంది. సనా యూసఫ్‌(Sana Yousuf) అనే టీనేజర్‌ దారుణ హత్యకు గురైంది. మంగళవారం ఇస్లామాబాద్‌ సుంబల్‌ ప్రాంతంలో ఆమె ఉంటున్న ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు. సనాతో మాట్లాడుతూనే.. వెంట తెచ్చుకున్న రివాల్వర్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన సనా అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలింపు జరిపి, ఫైసలాబాద్‌లో ఉండగా పట్టుకున్నారు. 

నిందితుడిని ఉమర్‌ హయత్‌(Umar Hayath) అలియాస్‌ కాకాగా నిర్ధారించారు. సనాను ఉద్దేశపూర్వకంగానే చంపినట్లు ఉమర్‌ అంగీకరించాడు.  సనాకు  టిక్‌టాక్‌లో 7.40 లక్షల మంది, ఇన్‌స్టాలో 5 లక్షల మంది ఫాలోయెర్లున్నారు. ఆమె సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తెలుస్తోంది. నేరానికి పాల్పడిన ఉమర్‌ కూడా టిక్‌టాకరేనని పోలీసులు ధృవీకరించారు. అయితే.. నేరానికి ఎందుకు పాల్పడ్డాడనే కారణాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. నిందితుడి నుంచి రివాల్వర్, ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

సనా(17) మెడిసిన్‌ మొదటి సంవత్సరం చదువుతోందని తెలుస్తోంది. ఆమె తండ్రి ప్రభుత్వ అధికారి, సోషల్‌ యాక్టివిస్ట్‌ కూడా. తల్లి గృహిణి. ఈమె 15 ఏళ్ల సోదరుడు ఖైబర్‌ ప్రావిన్స్‌లోని సొంతూరు చిత్రాల్‌కు వెళ్లాడు. ఘటన సమయంలో ఆమె దగ్గరి బంధువు ఒకరు ఇంట్లో ఉన్నారు. ఈ కేసులో ఆ బంధువే ప్రత్యక్ష సాక్షి.  

కాగా, పాకిస్తాన్‌(Pakistan)లో ఈ మధ్యకాలంలో హత్యకు గురైన మూడో మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్‌(Social Media Teenager) సనా కావడం గమనార్హం. పంజాబ్‌లో మహిళా టిక్‌టాకర్‌ను ఇటీవలే ఆమె బంధువొకరు చంపేశారు. ఫిబ్రవరిలో పెషావర్‌లో మరో మహిళా టిక్‌టాకర్‌ హత్యకు గురయ్యారు. సనా కేసు అక్కడి సోషల్‌ మీడియాను కుదిపేస్తోంది. ఈ కేసును పరువు హత్య, ప్రేమ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: ఏకాంత వీడియోలు ఒక్కొటిగా బయటకు..

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)