పుతిన్‌ని, మోదీ ఆపకుంటే.. పోలండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Published on Tue, 07/14/2026 - 19:23

ఢిల్లీ: పోలండ్ మంత్రి భారత ప్రధానిని ప్రశంసిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రరూపం దాల్చిన సమయంలో ప్రపంచాన్ని ఒక పెద్ద ముప్పు నుంచి  భారత ప్రధాని నరేంద్ర మోదీ కాపాడన్నారు. 2022 చివర్లో రష్యా వ్యూహాత్మక అణు ఆయుధాలను ఉపయోగించకుండా  రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఒప్పించడంలో పీఎం మోదీ కీలక పాత్ర పోషించారని  పేర్కొన్నారు. ఢిల్లీలో ఈ రోజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పోలాండ్ విదేశాంగ మంత్రి వ్లాడిస్లావ్ థియోఫిల్ బార్టోస్జెవ్స్కీ ANIతో మాట్లాడుతూ, "ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలో సుప్రసిద్ధ, అత్యంత గౌరవనీయుడైన రాజనీతిజ్ఞుడు. అలీన దేశంగా భారతదేశానికి రష్యన్ ఫెడరేషన్‌తో, అంతకుముందు సోవియట్ యూనియన్‌తో చాలాకాలంగా సంబంధాలు ఉన్నాయి. అధ్యక్షుడు పుతిన్  ప్రధానమంత్రి మోదీ చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు. 2022 చివరిలో ఉక్రెయిన్‌లో వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉపయోగించకుండా పుతిన్‌ను ఆపడంలో ప్రధానమంత్రి మోదీ పోషించిన పాత్ర గురించి నేను ప్రస్తావించాను. కానీ ఇది నిజం, అధ్యక్షుడు పుతిన్‌పై కొంత ఒత్తిడిని, ప్రభావాన్ని చూపగల కొద్దిమంది వ్యక్తులలో ప్రధానమంత్రి మోదీ ఒకరు." అని అన్నారు.

రష్యా తనను శత్రువుగా భావించని దేశాల నుండి వచ్చే శాంతి విజ్ఞప్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని పోలండ్ మంత్రి తెలిపారు. యుద్ధం మరింత పెరగకుండా చూడటంలో భారత్‌తో పాటు చైనా (షీ జిన్‌పింగ్) పాత్ర కూడా ముఖ్యమైనదని, అయితే ఈ సంక్షోభాన్ని ముగించడంలో భారత్ పాత్ర అత్యంత కీలకంగా మారిందని ఆయన అన్నారు.
 

రష్యా ఆయిల్ కొనుగోళ్లపై మారిన పోలండ్ వైఖరి
భారత్ రష్యా నుండి రాయితీపై ముడి చమురు కొనుగోలు చేయడంపై గతంలో పోలండ్ చేసిన విమర్శలపైనా మంత్రి క్లారిటీ ఇచ్చారు.రష్యా నుండి చౌకగా లభించే చమురును కొనుగోలు చేయడం ద్వారా భారత్ రష్యా యుద్ధ ఆర్థిక వ్యవస్థకు పరోక్షంగా మద్దతు ఇస్తోందని తాము గతంలో భావించామని, అయితే మార్కెట్ ధర కంటే 40% తక్కువకు చమురు లభిస్తున్నందున ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు తాము అర్థం చేసుకున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఈ అంశం రెండు దేశాల మధ్య ఎలాంటి విభేదాలకు కారణం కాదని ఆయన స్పష్టం చేశారు.

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)