Breaking News

యుద్ధంలో బిగ్‌ ట్విస్ట్‌.. అమెరికా దాడులకు పుతిన్‌ చెక్‌?

Published on Sat, 03/07/2026 - 07:25

వాషింగ్టన్‌: పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్‌కు రష్యా చాటుగా సాయపడుతోందా? అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల కదలికలతో పాటు గల్ఫ్‌లోని ఆ దేశ సైనిక స్థావరాలు తదితరాలకు సంబంధించిన సున్నితమైన నిఘా సమాచారాన్ని వారం రోజులుగా ఎప్పటికప్పుడు ఇరాన్‌కు అందిస్తూ వస్తోందా? తద్వారా వాటిపై దాడులకు సహకరిస్తోందా? అంటే, అవునని పేర్కొంటూ వాషింగ్టన్‌ పోస్టు వార్తా సంస్థ సంచలనాత్మక కథనం వెలువరించింది.

‘యుద్ధం మొదలైన ఒకట్రెండు రోజుల్లోనే ఇరాన్‌ నిఘా సామర్థ్యం దాదాపుగా కుప్పకూలింది. అయినా అమెరికా యుద్ధ నౌకలు, గల్ఫ్‌ దేశాల్లోని స్థావరాలు, రాయబార కార్యాలయాలపై ఇరాన్‌ కచ్చితత్వంతో దాడులు చేయగలిగింది. రష్యా అందించిన నిఘా సమాచారంతోనే ఇది సాధ్యమైందనడం సుస్పష్టం’ అని సదరు అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ దీనిపై ఎలా స్పందిస్తారోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యాపైనా ఆయన తీవ్ర చర్యలకు దిగితే ఇప్పటికే పశ్చిమాసియా అంతటా కుంపట్లు రాజేస్తున్న యుద్ధం మరింతగా విస్తరించే ప్రమాదముంది.

ఇరాన్‌కు కావాల్సింది.. ఓ మంచి నాయకుడు: ట్రంప్‌ 
మరోవైపు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్‌కు ఒక మంచి నాయకుడు కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై పలువురు నేతల పేర్లు తమ దృష్టిలో ఉన్నట్టు చెప్పారు. ‘ఇరాన్‌కు మంచి భవిష్యత్తుంటుంది. ఇతర దేశాల సాయంతో ఆ దేశాన్ని సంక్షోభం నుంచి బయట పడేస్తాం. ఆర్థికంగా అత్యంత బలోపేతం చేస్తాం’ అని ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ (మాగా)’తరహాలో ‘మేక్‌ ఇరాన్‌ గ్రేట్‌ అగైన్‌’అంటూ అధ్యక్షుడు ముక్తాయించడం విశేషం! మధ్యవర్తిత్వం ద్వారా యుద్ధానికి తెర దించేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నట్టు ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ చెప్పారు. సోషల్‌ మీడియా పోస్టులో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు.

ఇరాన్‌ యుద్ధ నౌకను ముంచేశాం: అమెరికా 
డ్రోన్లు, ఇతర ఆయుధాలతో కూడిన ఇరాన్‌ యుద్ధ నౌక ఐఆర్‌ఐఎస్‌ షహీద్‌ బఘేరీని ముంచేసినట్టు అమెరికా ప్రకటించింది. అది మంటల్లో తగలబడిపోతున్న ఫుటేజీని యూఎస్‌ మిలిటరీ సెంట్రల్‌ కమాండ్‌ శుక్రవారం విడుదల చేసింది. ఇరాన్‌ సైన్యం మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. 180 మీటర్ల పొడవైన షహీద్‌ నిజానికి రవాణా నౌక. యుద్ధ అవసరాల రీత్యా ఇరాన్‌ దాన్ని తాత్కాలికంగా డ్రోన్‌ క్యారియర్‌గా మార్చినట్టు సమాచారం. ఇది రీ ఫ్యూయలింగ్‌ కోసం ఆగకుండా ఏకబిగిన 22 వేల నాటికల్‌ మైళ్లు ప్రయాణించగలదు!. 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)