Breaking News

ఆరు వేళ్లు.. నెతన్యాహూ సేఫేనా? రూమర్లు హల్‌చల్‌

Published on Sat, 03/14/2026 - 16:16

Iran war ఇరాన్‌పై  అమెరికా ఇజ్రాయెల్‌  భీకరదాడులు, ఇరాన్‌ సుప్రీం నేత హత్య తరువాత ఇరాన్‌కూడా అదే స్థాయిలో ప్రతిదాడులకు దిగింది. దీంతో సోషల్‌ మీడియాలో పలు అసత్య ప్రచారాలు, ఫేక్‌ వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) గురించి తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో  తెగ వైరల్‌ అవుతోంది. అసలు  వాస్తవం ఏంటి?

ఇజ్రాయెల్ ప్రధాని అధికారికసోషల్ మీడియా ఖాతా నుండి ఆయన మరణించారని ప్రకటించిన సందేశానికి  పోస్ట్‌ కావడంతో ఒక్కసారిగా  గందరగోళం చెలరేగింది. దీనికి సంబంధించిన  స్క్రీన్‌షాట్‌లు వైరల్‌గా మారాయి. అంతేకాదు  ఇటీవల ఆయన మీడియాతో  మాట్లాడిన  వీడియో ఏఐతో రూపొందించారనే  ఊహాగానాలు వెల్లువెత్తాయి. పాత వీడియోకు కొత్త వాయిస్‌ను జోడించారనే పుకార్లు షికారు చేశాయి.

నెతన్యాహుకు ఆరు వేళ్లు ఉన్నాయా? 
నెతన్యాహు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న వీడియో వైరల్  అయింది. దీంతో వీడియోలు నెతన్యాహుకు ఆరు వేళ్లు ఉన్నట్టు కనిపించిందనీ, ఇది  ఏఐతో సృష్టించిన వీడియో అని రూమర్లు   వ్యాపించాయి. అసలు ఆయన బతికే  ఉన్నారా అనే ఆందోళన రేగింది. జియోనిస్ట్ నాయకుడు ఎక్కడ ఉన్నాడనేది  సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చింది.

అసలు  నిజం ఏమిటంటే
ఇజ్రాయెల్ నాయకుడి మరణం గురించి ఆన్‌లైన్‌లో వ్యాపించిన పుకార్లను అనేక  ఫ్యాక్ట్‌ చెక్‌ సంస్థలు, ఫ్యాక్ట్-చెకర్లు , వార్తా సంస్థలు ఇప్పటికే తోసిపుచ్చాయి.నెతన్యాహు సురక్షితంగా ఉన్నారనీ,  సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో  AI సృష్టి అని తేలింది. ఈ వీడియోలు ఫేక్‌ వీడియోలు అని ఫ్యాక్ట్‌ చెక్‌ నిపుణులు తేల్చారు.

ది సండే గార్డియన్ ఉటంకించిన విశ్లేషకుల ప్రకారం, ఈ పుకార్లు ఎక్కువగా నకిలీ స్క్రీన్‌షాట్‌లు, తప్పుడు దృశ్యాలు.  తీవ్ర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కాలంలో  ఇవి ధృవీకరించని కంటెంట్ ఆధారంగా  రూపొందించినవి. ఈ వాదనలకు ధృవీకరించబడిన ఆధారాలు లేవు.

ఇదీ చదవండి: షాకింగ్‌ : సవానీ గ్రూపు సోదరులకు 835 ఏళ్ల జైలు శిక్ష

అలాగే ఆరువేళ్లున్నాయనే విషయంపై కూడా ఫ్యాక్ట్‌ చెకర్లు స్పందించారు. అది ఆప్టికల్ భ్రమ అనీ, ఒకే ఫ్రేమ్‌ను విడిగా పరిశీలించినప్పుడు కెమెరా కోణాలు, మోషన్ బ్లర్చ హ్యాండ్ పొజిషనింగ్ లాంటి తప్పుదారి పట్టించే దృశ్యాలను ఉత్పత్తి చేస్తాయని నిపుణులు అంటున్నారు.

(మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్‌ వీడియో వైరల్‌)

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)