Breaking News

మోదీ చేసి చూపించారు.. పుతిన్‌ ప్రశంసలు

Published on Fri, 06/30/2023 - 12:52

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు గుప్పించారు. మేక్‌ ఇన్‌ ఇండియా ద్వారా ప్రధాని మోదీ అద్భుతాలు సృష్టించి అనుకున్నది సాధించారని.. ఆ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారాయన. 

మా మిత్ర దేశం ఇండియా.. ఆ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యాకు గొప్ప మిత్రుడు. కొన్నేళ్ల కిందట మేక్‌ ఇండియా అనే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. సమర్థవంతంగా దానిని ఆయన తన దేశంలో అమలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది అని మాస్కోలో జరిగిన ఓ ఈవెంట్‌లో అధ్యక్షుడు పుతిన్‌ ప్రసంగించారు. 

దేశీయ ఉత్పత్తుల ప్రోత్సాహంతో ఎలాంటి అభివృద్ధి సాధించవచ్చో ప్రధాని మోదీ భారత్‌లో చేసి చూపించారని.. రష్యా దీనిని ఆదర్శంగా తీసుకోవాలని పుతిన్‌ పేర్కొన్నట్లు అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది.

ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక పాశ్చాత్య దేశాల ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం దారుణంగా పడింది. ఈ నేపథ్యంలో.. స్వదేశీ ఉత్పత్తులపై ఆధారపడడం ద్వారా సంక్షోభం నుంచి బయటపడొచ్చని గత కొంతకాలంగా పుతిన్‌ రష్యా ప్రజలకు పిలుపు ఇస్తూ వస్తున్నారు.

ఇదీ చదవండి: పెద్దన్నకు మతిమరుపే కాదు.. ఈ సమస్య కూడా ఉంది!

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)