Breaking News

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. ట్రంప్‌నకు మోదీ థ్యాంక్యూ

Published on Wed, 10/22/2025 - 09:12

రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు.. ప్రపంచం కోసం కలిసి కట్టుగా ముందుకు సాగాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దీపావళి శుభాకాంక్షలు తెలియజేయగా.. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మోదీ తన ఎక్స్‌ ఖాతాలో(Modi Diwali Reply To Trump) ఓ ట్వీట్‌ చేశారు.

దీపావళి సందర్భంగా భారత ప్రధాని మోదీతో మాట్లాడినట్లు ట్రంప్‌(Trump Diwali Wishes) చెప్పిన సంగతి తెలిసిందే. ప్రపంచ వాణిజ్యం సహా పలు అంశాలు తమ మధ్య చర్చకు వచ్చినట్లు చెప్పారాయన. ఈ క్రమంలో థ్యాంక్యూ చెబుతూ మోదీ బుధవారం ఉదయం ఓ ట్వీట్‌ చేశారు.

వెలుగుల పండుగ పూట(Diwali).. ఈ రెండు ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచానికి ఆశాకిరణాలు ప్రసరింపజేస్తూ ముందుకు సాగాలి. ముఖ్యంగా.. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి అని మోదీ ట్వీట్‌ చేశారు.

పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్‌ ఈ ఏడాది మే మొదటి వారంలో ఆపరేషన్‌ సిందూర్‌ను చేపట్టి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఆ సమయంలో ఇరు దేశాల ఉద్రిక్తతలను తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించుకుంటూ వస్తున్నారు. అయితే కాల్పుల విరమణలో ఆయన ప్రమేయాన్ని భారత్‌ మాత్రం ఖండిస్తూ వస్తోంది. 

మరోవైపు.. పాక్‌ మాత్రం ట్రంప్‌ చెప్పిందే నిజమని, ఆయన చొరవతోనే యుద్ధం ఆగిందని, అందుకే ఆయన్ని నోబెల్‌ శాంతి బహుమతికి నామినేటె్‌ చేశామని అంటోంది. ఈ క్రమంలో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ‘గాజా శాంతి సదస్సు’లో ప్రసంగిస్తూ ట్రంప్‌ భజనకు దిగగా.. ఆ దేశ ప్రజలే ఆ వ్యవహారాన్ని భరించలేక సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేసి పడేశారు.

ఇంకోవైపు,.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) భారత్‌ను ఉద్దేశిస్తూ రష్యా చమురు కొనుగోళ్ల చేసే ప్రకటనల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మంగళవారం (స్థానిక కాలమానం ప్రకారం) వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఇందులో ట్రంప్‌తో సహా కీలక అధికారులు పాల్గొన్నారు.   ఈ సందర్భంగా ఆయన భారతీయ- అమెరికన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

‘భారతదేశ ప్రజలకు మా దీపావళి శుభాకాంక్షలు. భారతీయులంటే నాకు చాలా ఇష్‌టం. ఇరుదేశాల మధ్య కొన్ని ముఖ్యమమైన ఒప్పందాల కోసం పని చేస్తున్నాం. రష్యా నుంచి భారత్‌ భారీగా చమురు కొనబోదని వ్యాఖ్యానించారు.  నేను ఈ రోజు మీ ప్రధానితో మాట్లాడాను. మా మధ్య గొప్ప సంభాషణ జరిగింది. అనేక విషయాల గురించి మేం మాట్లాడుకున్నాం. వాణిజ్యం గురించి చాలాసేపు చర్చించాం. ఆయనకు దానిపై చాలా ఆసక్తి ఉంది. పాకిస్థాన్‌తో ఘర్షణలు వద్దనే విషయంపై మేము కొంతకాలం క్రితం మాట్లాడాం. వాణిజ్యం ద్వారానే అది సాధ్యమైందనుకుంటున్నా’ అని ట్రంప్‌ పేర్కొనడం గమనార్హం. 

ఇప్పటిదాకా.. రష్యా చమురు కొనుగోళ్లను భారత్‌ (India) నిలిపివేసిందని, నిలిపివేయబోతోందని, నిలిపివేయకపోతే భారీ సుంకాలు తప్పవంటూ ట్రంప్‌ రోజుకో స్టేట్‌మెంట్‌ ఇస్తూ వచ్చారు. ఇప్పుడేమో.. భారత్‌ పెద్ద మొత్తంలో చమురు (Russian Oil) కొనబోదంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. 

ఇదీ చదవండి: దీపావళికి ఏఐతో విషెస్‌.. మండిపడ్డ హిందువులు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)