Breaking News

మళ్లీ భారత్‌ను టార్గెట్‌ చేసిన ట్రంప్‌

Published on Tue, 11/04/2025 - 07:13

వాషింగ్టన్‌: రష్యా , ఉత్తర కొరియాలతో పాటు పాకిస్తాన్,  చైనాలు కూడా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరువైపులా అణ్వాయుధ ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నందున ఇది భారతదేశానికి ఆందోళన కలిగించే విషయమని ‘సీబీఎస్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ పరోక్షంగా వ్యాఖ్యానించారు. అలాగే తాను అమెరికా దళాలకు అణ్వాయుధాలను పరీక్షించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సమర్థించుకున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘సీబీఎస్‌’కు 60 నిమిషాలపాటు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. 33  ఏళ్ల నిషేధం తర్వాత అమెరికన్ దళాలకు అణ్వాయుధాలను పరీక్షించాలంటూ తాను ఆదేశాలు జారీ చేశానన్నారు.  చైనా, పాకిస్తాన్ ఇప్పటికే రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని అన్నారు. అయితే ఆ దేశాలు ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించలేదని, తాము అందుకు భిన్నమని అన్నారు. ఉత్తర కొరియా, పాకిస్తాన్ పరీక్షలు చేస్తున్నాయనే సమాచారం తమవద్ద ఉందన్నారు. భారత్‌, పాక్‌లు గత మే నెలలో అణు యుద్ధం అంచునకు చేరాయని, అయితే తాను వాణిజ్యం, సుంకాలతో దానిని అడ్డుకున్నానని అన్నారు. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోకపోతే లక్షలాది మంది చనిపోయేవారని ట్రంప్‌ పేర్కొన్నారు.

ఆ అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలు భూగర్భంలో పరీక్షలు నిర్వహిస్తాయి. ఈ పరీక్షలతో ఏమి జరుగుతుందో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. అయితే  కంపనం అనుభూతి మాత్రం కలుగుతుంది. గ్లోబల్ మానిటరింగ్ స్టేషన్లు భూగర్భ అణు పేలుళ్ల వల్ల కలిగే భూకంపం లాంటి కంపనాలను గుర్తిస్తాయి. అటువంటి పరీక్షలను రహస్యంగా నిర్వహించవచ్చని, వాటిని గుర్తించలేమని ట్రంప్ పేర్కొన్నారు. ఒకవేళ చైనా, పాకిస్తాన్‌లు అణ్వాయుధాలను పరీక్షిస్తుంటే, అది భారతదేశాన్ని మరింత అస్థిరంగా మారుస్తుందని ట్రంప్‌ పరోక్షంగా పేర్కొన్నారు.

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)