Breaking News

దౌత్య యుద్ధం దెబ్బకు దిగొచ్చిన పాక్‌!

Published on Tue, 05/27/2025 - 12:02

టెహ్రాన్‌: దౌత్య యుద్ధం దెబ్బకు పాకిస్తాన్‌ దిగొచ్చింది. భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధమంటూ ఆ దేశ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌(Shehbaz Sharif) సోమవారం కీలక ప్రకటన చేశారు. కశ్మీర్‌ సహా అన్ని అంశాలపై చర్చలకు సిద్ధమంటూ ఇరాన్‌ వేదికగా ప్రకటించారాయన.  

పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపై భారత్‌ జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు పలువురు ఎంపీలతో కూడిన 7 అఖిల పక్ష బృందాలు 33 దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో.. ఇరాన్‌ పర్యటనలో ఉన్న పాక్‌ ప్రధాని‌ షెహ్‌బాజ్‌ షరీఫ్‌ శాంతి ప్రస్తావన తెస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘భారత్‌తో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నాం(Peace Talks). కశ్మీర్‌, ఉగ్రవాదంపై పోరు, నీటి పంపకం, వాణిజ్యం.. ఇలా అన్ని వివాదాలపై ఇరు దేశాలం సామరస్యంగా చర్చించుకునేందుకు మేం రెడీ. ఒకవేళ శాంతి చర్చలకు భారత్‌ గనుక సమ్మతిస్తే.. మేం శాంతిని ఎంత బలంగా కోరుకుంటున్నామో వాళ్లకు తెలియజేస్తాం. ఈ విషయంలో మా చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ ప్రకటనను పాక్‌ పత్రిక ది డాన్‌ ప్రముఖంగా ప్రచురించింది. 

మరోవైపు.. టెహ్రాన్‌లో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా ఖమేనీతో చర్చలు జరిపారు. ఈ భేటీకి పాక్‌ సైన్యాధ్యక్షుడు అసీమ్‌ మునీర్‌ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగానూ భారత్‌తో ఉద్రిక్తతలు, గాజా అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించినట్లు డాన్‌ కథనం పేర్కొంది. పాక్‌ శాంతి ప్రతిపాదనను ప్రశంసించిన ఇరాన్‌.. ఇరు దేశాలు(భారత్‌-పాక్‌) మధ్య త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆపరేషన్‌ సింధూర్‌ పేరిట పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాదులను భారత సైన్యం నాశనం చేసింది. ఆపై పాక్‌పై దౌత్యపరమైన యుద్ధం చేస్తోంది. ఆ దేశ దౌత్యవేత్తలను వెనక్కి పంపించేసింది. ఉగ్రవాదాన్ని పాక్‌ ఎలా పెంచి పోషిస్తూ ప్రోత్సహిస్తోందనే విషయాన్ని అంతర్జాతీయ వేదికలపై గట్టిగా వినిపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో అగ్రదేశాలు సహా పలు దేశాలు భారత్‌కు మద్ధతు ప్రకటించాయి.  ఈ క్రమంలో పాక్‌కు నిధులు సమకూర్చకూడదని ఐఎంఎఫ్‌కి కూడా విజ్ఞప్తి చేసింది కూడా. అయితే 

తాజాగా ఇస్లామాబాద్‌ వర్గాలు దీర్ఘకాలికంగా కొనేసాగుతున్న వివాదాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీకి కబురు పంపాయి. భారత ప్రధాని మోదీ మాత్రం ఆ చర్చలు పరిమితంగానే ఉంటాయని ఇప్పటికే స్పష్టం చేశారు. పాక్‌తో చర్చలు గనుక జరగాల్సి వస్తే.. అది పీవోకే, ఉగ్రవాద అంశాలపై మాత్రమేనని కుండబద్ధలు కొట్టారు.

ఇదీ చదవండి: ఒట్టు.. నా భార్యను నన్ను కొట్టలే!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)