Breaking News

ఉస్మాన్ హాదీ హత్య అందుకే..?

Published on Wed, 12/24/2025 - 15:34

బంగ్లాదేశ్‌ ప్రస్తుతం హింసతో అట్టుడుకిపోతుంది. ఇటీవల అక్కడ రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మరణంతో అక్కడ అక్కడి మతతత్వ శక్తులు ఆదేశంలోని హిందువులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే హత్యకు గురైన ఉస్మాన్ హాదీ సోదరుడు అక్కడి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలను ప్రక్కదోవ పట్టించేందుకు యూనస్ ప్రభుత్వమే ఉస్మాన్‌ని హత్య చేయించిందని ఆరోపించారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై ప్రస్తుతం దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత ఆ దేశంలోని మతతత్వ శక్తులు భారత్‌పై పగ పెంచుకున్నాయి.  ఈ సందర్భంలోనే అక్కడ నివసిస్తున్న దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని అక్కడి అల్లరిమూకలు తీవ్రంగా కొట్టిచంపారు. అనంతరం మరో హిందూ కుటుంబంపై దాడి చేయగా వారు తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనలతో భారత్‌లో నిరసనలు మిన్నంటాయు ఢిల్లీలోని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యలయాన్ని వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ముట్టడించారు.

అయితే ఇటీవల జరిగిన ఉస్మాన్ హాదీ హత్యపై ఆయన తమ్ముడు ఒమర్ హాది సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వమే ఎలక్షన్లని తప్పుదారి పట్టించాలనే ఉద్దేశంతో ఉస్మాన్‌ హాదీని హత్య చేయించిందని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లోని షాబాద్‌లో ఉస్మాన్ మృతి సంతాపంగా ర్యాలీ నిర్వహించారు అందులో అతన సోదరుడు మాట్లాడుతూ. "మీరే ఉస్మాన్ హాదీని చంపించారు. ఇప్పుడు అతని చావు పేరుతో ఎన్నికలకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.నా సోదరుడు ఎన్నికలు జరగాలని కోరుకున్నాడు. ఆయన నిర్ణయాన్ని గౌరవించి ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి" అని ఒమర్ తెలిపారు.

ఉస్మాన్ హాదీ విదేశీ శక్తులకు తలొగ్గడానికి నిరాకరించాడని అందుకే ఆయనను కుట్రపన్ని హత్య చేయించారని తెలిపారు. అతని చావుకు కారణమైన వారు ఏదో ఒకరోజు దేశాన్ని వదిలి పారిపోవాల్సివస్తుందని హెచ్చరించారు. ఉస్మాన్ హాదిని హత్య చేసిన వారిని గుర్తించడానికి ప్రభుత్వానికి 30 రోజుల గడువు ఇస్తున్నామని అంతలోపు వారిని అరెస్టు చేయకపోతే  బంగ్లావ్యాప్తంగా తీవ్ర నిరసనలు చేపడతామని అక్కడి నాయకులు  యూనస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)