Breaking News

టైమ్స్ జాబితాలో భారతీయులకు దక్కని చోటు!

Published on Thu, 04/17/2025 - 08:37

ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్‌ మ్యాగజైన్‌(Time Magazine List 2025) జాబితా 2025 విడుదలైంది. వంద మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. అయితే అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది భారతీయులెవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం.

2025కి గానూ మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్‌ జాబితాను టైమ్‌ మ్యాగజైన్‌ విడుదల చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌, నోబెల్‌ బహుమతి గ్రహీత.. బంగ్లాదేశ్‌ తాత్కాలిక  ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, టెస్లా సీఈవో ఇలాన్‌ మస్క్‌ తదితరులకు చోటు దక్కింది. జిమ్నాస్ట్ సిమోన్‌ బైల్స్‌, పాపులర్‌ సింగర్‌ ఈద్‌ షరీన్‌, ఏఐ దిగ్గజం డెమిస్ హస్సాబిస్(Demis Hassabis) తదితరుల పేర్లు ఉన్నాయి.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. భారత్‌ నుంచి ఈ ఏడాది జాబితాలో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. గతంలో.. షారూఖ్‌ ఖాన్‌, అలియా భట్‌, సాక్షి మాలిక్‌(రెజ్లర్‌) పేర్లు ఈ జాబితాకు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య సంవత్సరాల్లో ఇలా భారతీయుల పేర్లు లేకపోవడం ఇదే తొలిసారి.  ఈసారి విశేషం ఏంటంటే.. నేరుగా భారతీయులకు చోటు దక్కకపోయినా భారత సంతతికి చెందిన వర్టెక్స్‌ ఫార్మాసూటికల్స్‌ సీఈవో రేష్మా కేవలరమణి(Reshma Kewalramani) పేరు ఈ జాబితాలోకి ఎక్కింది. రేష్మ ముంబైలో పుట్టారు. ఆమెకు 11 ఏళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం అమెరికాకు వలస వెళ్లి స్థిరపడింది. 

రేష్మా కేవలరమణి(52)

టైమ్‌ జాబితాకు ప్రాధాన్యత ఎందుకు?
టైమ్‌ మ్యాగజైన్‌ అనేది న్యూయార్క్‌ కేంద్రంగా నడిచే వార్త ప్రచురణ సంస్థ. 1923 మార్చి 3వ తేదీన ఇది ప్రారంభమైంది. సమకాలీన వార్తలకు పాఠకులకు అందించే ఉద్దేశంతో హెన్రీ లూస్‌, బ్రిటన్‌ హాడెన్‌ దీనిని స్థాపించారు. కాలక్రమేణా దీనికి ప్రపంచస్థాయి ఆదరణ లభించింది. అనేక రంగాలను మలుపు తిప్పిన వ్యక్తుల పేర్లతో ప్రతీ ఏటా జాబితా విడుదల చేస్తూ వస్తోంది టైమ్స్‌ మ్యాగజైన్‌. అలా..

అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను 1999లో తొలిసారి రిలీజ్‌ చేసింది టైమ్‌ మ్యాగజైన్‌. మేధావులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఈ జాబితా గురించి విస్తృతంగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే 2004 నుంచి క్రమం తప్పుకుండా ప్రతీ ఏడాది జాబితాను విడుదల చేస్తూ వస్తోంది టైమ్‌ మ్యాగజైన్‌. 

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)