నెతన్యాహుకు ట్రంప్‌ కవచం.. అమెరికా గడ్డపై అది అసాధ్యం!

Published on Tue, 07/21/2026 - 09:23

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ‘అరెస్ట్‌ వ్యవహారం’ అమెరికాలో ఈసారికి రాజకీయ దుమారం రేపుతోంది. అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ నేపథ్యంలో.. న్యూయార్క్‌ పర్యటనకు వస్తే నెతన్యాహును అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని నగర మేయర్‌ జోహ్రాన్‌ మమ్దానీ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలకు స్వయానా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

‘‘బెంజమిన్‌ నెతన్యాహు అమెరికాలో ఎక్కడా, ఎప్పుడూ అరెస్ట్‌ కాబోరు’’ అంటూ ట్రంప్‌ స్పష్టం చేశారు. సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల కోసం నెతన్యాహు న్యూయార్క్‌కు వచ్చే అవకాశం ఉండటంతో ఈ అంశం తెరపైకి వచ్చింది.

‘అరెస్ట్‌ చేయాలనే ప్రశ్నే లేదు’.. ట్రంప్‌ స్పష్టం
నెతన్యాహు అమెరికా పర్యటనపై చర్చ జరుగుతున్న వేళ.. ట్రంప్‌ తన సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. అమెరికా భూభాగంలో ఇజ్రాయెల్‌ ప్రధానిని అరెస్ట్‌ చేసే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని పేర్కొన్నారు. ఇటీవల ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్‌ పాత్రను కూడా ట్రంప్‌ ప్రశంసించారు. అయితే న్యూయార్క్‌ మేయర్‌ మమ్దానీ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. ఆయన వ్యాఖ్యలకు సమాధానంగానే ట్రంప్‌ ప్రకటన వెలువడినట్లు భావిస్తున్నారు.

మమ్దానీ వ్యాఖ్యలతో మొదలైన వివాదం
న్యూయార్క్‌ మేయర్‌ జోహ్రాన్‌ మమ్దానీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నెతన్యాహు నగరానికి వస్తే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో పరిశీలిస్తున్నామని తెలిపారు. ‘‘నెతన్యాహు ది హేగ్‌లో ఉండాల్సిన వ్యక్తి’’ అని వ్యాఖ్యానించిన ఆయన.. అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు ఆయనపై వారెంట్‌ జారీ చేసిందని గుర్తుచేశారు. అయితే అదే సమయంలో చట్టాలకు లోబడే తాము పనిచేస్తామని కూడా మమ్దానీ స్పష్టం చేశారు. రాజకీయ అభిప్రాయాల ఆధారంగా కాకుండా.. న్యూయార్క్‌ చట్టాలు, అమెరికా నిబంధనల ప్రకారమే నిర్ణయం ఉంటుందని తెలిపారు.

ఐసీసీ వారెంట్‌ చుట్టూ వివాదం
గాజాలో ఇజ్రాయెల్‌ సైనిక చర్యలకు సంబంధించి ఆరోపణలపై 2024లో అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు నెతన్యాహుపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. అయితే ఇజ్రాయెల్‌ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ఐసీసీకి తమపై అధికార పరిధి లేదని పేర్కొంది. ఇదిలా ఉండగా.. అమెరికా, ఇజ్రాయెల్‌ రెండూ ఐసీసీని ఏర్పాటు చేసిన రోమ్‌ ఒప్పందంలో భాగస్వాములు కావు. దీంతో ఐసీసీ వారెంట్లను అమలు చేయాల్సిన చట్టపరమైన బాధ్యత అమెరికాకు లేదని నిపుణులు చెబుతున్నారు.

ఇజ్రాయెల్‌ ఆగ్రహం
మమ్దానీ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్‌ కూడా తీవ్రంగా స్పందించింది. ఐసీసీని ‘నకిలీ న్యాయస్థానం’గా అభివర్ణిస్తూ.. నెతన్యాహుపై జారీ చేసిన వారెంట్‌ అసంబద్ధమని పేర్కొంది. మమ్దానీ దేశీయ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఇజ్రాయెల్‌ ఆరోపించింది.

సెప్టెంబర్‌ పర్యటనపై ఉత్కంఠ
ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాలకు ప్రపంచ దేశాల నేతలు న్యూయార్క్‌కు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో నెతన్యాహు గత రెండేళ్ల పర్యటనల సందర్భంగా.. ఇలాంటి చర్చే నడుస్తూ వస్తోంది. అరెస్ట్‌ భయంతోనే ఆయన ప్రత్యామ్నాయ మార్గాల్లో.. అతి గోప్యంగా న్యూయార్క్‌కు చేరుకుంటున్నారనే చర్చా జరుగుతోంది. అంతేకాదు.. ఐరాసలోనూ ఆయనకు ‘నిరసన గళం’తో చేదు అనుభవం ఎదురవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో.. మామ్దానీ కామెంట్ల నేపథ్యంలో ఈసారి పర్యటనపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఐసీసీ వారెంట్‌.. మరోవైపు అమెరికా రక్షణగా నిలవడం.. ఇంకోవైపు న్యూయార్క్‌ మేయర్‌ వ్యాఖ్యలు.. ఈ పరిణామాలతో నెతన్యాహు అమెరికా పర్యటన అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)