Breaking News

లాస్‌ ఏంజెలెస్‌లో...ముదురుతున్న రగడ

Published on Mon, 06/09/2025 - 06:18

పారామౌంట్‌(యూఎస్‌): అమెరికాలోకి అక్రమంగా చొరబడిన వారిని పట్టుకునేందుకు ట్రంప్‌ సర్కార్‌ మొదలెట్టిన ఏరివేత కార్యక్రమం మరింత ఉద్రిక్తంగా మారింది. అక్రమ అరెస్ట్‌లను ఆపితే ఆందోళనలు తగ్గుముఖం పడతాయని, బలగాలను మొహరించి సమస్యను మరింత జఠిలతరం చేయొద్దని విపక్ష డెమొక్రటిక్‌ పాలిత నగరాల మేయర్లు మొత్తుకుంటున్నాసరే ట్రంప్‌ ప్రభుత్వం ‘నేషనల్‌ గార్డ్‌’ బలగాలను రంగంలోకి దింపింది. ఒక్క లాస్‌ ఏంజెలెస్‌ పరిధిలోనే ఏకంగా 2,000 మంది కాలిఫోర్నియా నేషనల్‌ గార్డ్‌ సభ్యులు మొహరించారు. దీంతో వీరికి దీటుగా వందలాది మంది ఆందోళనకారులు తమ నిరసనలను ఉధృతంచేశారు. రెండో రోజూ రోడ్లపై చేరి ఫెడరల ఏజెంట్లు, ఎఫ్‌బీఐ, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  

పారామౌంట్‌ పట్టణంలోనూ.. 
లాస్‌ ఏంజెలెస్‌ సిటీ శివారులోని పారామౌంట్‌ పట్టణంలో హోంశాఖ వద్ద వందలాది మంది నిరసనకారులు గుమిగూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. దీంతో వీళ్లను చెదరగొట్టేందుకు పోలీసులు అత్యంత తీక్షణ కాంతిని వెదజల్లే ఫ్లాష్‌ బ్యాంగ్‌ గ్రనేడ్లను విసిరారు. రబ్బర్‌ బుల్లెట్లను షూట్‌చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. లాస్‌ ఏంజెలెస్‌లో పలు ప్రాంతాల్లో ఆందోళనకారులపైకి పోలీసులు ఇలా భాష్పవాయు గోళాలు, పెప్పర్‌ బాల్స్, పొగ బాంబులను ప్రయోగించారు. పోలీసులు ప్రయాణిస్తున్న బోర్డర్‌ పెట్రోల్‌ వాహనాలపైకి ఆందోళనకారులు ఇటుకలు, రాళ్లు విసిరారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాహనాల రాకపోకలు స్తంభింపజేస్తూ వలసదారులు రోడ్లపై టైర్లను కాలి్చపడేశారు. ఇటీవలికాలంలో లాస్‌ ఏంజెలెస్‌ పరిధిలో 118 మంది వలసదారులు, ఐదుగురు నేరస్తులను అరెస్ట్‌చేసినట్లు హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. 

సైన్యాన్ని దింపుతాం: రక్షణ మంత్రి హెచ్చరిక 
‘అక్రమ వలసదారులు, నేరగాళ్లను పట్టుకునేందుకు ఫెడరల్‌ ఏజెంట్లు చేస్తున్న ముమ్మర గాలింపు చర్యలను ఆందోళనకారులు ఇలాగే అడ్డుకుంటే అనివార్యపరిస్థితుల్లో మేం సైన్యాన్ని రంగంలోకి దింపాల్సి ఉంటుంది. క్యాంప్‌ పెడల్టన్‌లోని మెరైన్‌లనూ రప్పిస్తాం’ అని రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ హెచ్చరించారు. మరోవైపు పారామౌంట్, కాంప్టన్‌ పట్టణాల్లో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఒక కారుకు నిప్పంటించారు. పారామౌంట్‌ బిజినెస్‌ పార్క్‌ వద్ద ఇమిగ్రేషన్‌ అధికారులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. 

బాణసంచా కాలుస్తూ, షాపింగ్‌ కార్ట్‌లను రోడ్లపై పడేశారు. బోర్డర్‌పెట్రోల్‌ వాహనశ్రేణిపై రాళ్లు రువ్వారు. లాస్‌ ఏంజెలెస్‌ ఫెడరల్‌ డిటెన్షన్‌ భవనం వద్ద సైతం గుమిగూడి అరెస్టయిన వాళ్లను విడుదలచేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో వారిలో కొందరు పోలీసులు అరెస్ట్‌చేశారు. ‘‘వారెంట్ల ప్రకారం సైతం చాలా మంది అక్రమవలసదారులను ఆదివారం సైతం అరెస్ట్‌చేశాం. డ్యూటీ నిర్వహణకు అడ్డుపడిన డజన్లకొద్దీ జనాలనూ అరెస్ట్‌చేశాం’’ అని యూఎస్‌ అటార్నీ బిల్‌ ఈజీలీ ప్రకటించారు. అరెస్ట్‌ అయిన వారి ఫొటోలను తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌చేశారు. అక్రమ వలసదారుల ఏరివేత వేళ ఇమిగ్రేషన్, కస్టమ్స్‌ అధికారులకు ఎన్‌జీ బలగాలు తాత్కాలికంగా రక్షణగా ఉంటాయని ట్రంప్‌ చెప్పారు.

నేషనల్‌ గార్డ్‌ రంగప్రవేశంపై అభ్యంతరాలు 
రాష్ట్రాల్లో శాంతి భద్రతల అంశాన్ని రాష్ట్రాలే పరిష్కరించుకుంటాయి. కానీ ట్రంప్‌ ఇలా అధ్యక్షుడి అసాధారణ అధికారాలను ఉపయోగించి నేషనల్‌ గార్డ్‌ను రప్పించడంపై లాస్‌ ఏంజెలెస్‌ మేయర్‌ కరెన్‌ బాస్, కాలిఫోరి్నయా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ బలగాలపై గవర్నర్‌కే అధికారాలుంటాయి. కానీ టైటిల్‌ 10 అధికారాన్ని ఉపయోగించి నేషనల్‌ గార్డ్‌ బలగాలను ట్రంప్‌ రప్పించారు.  గతంలో పౌరహక్కుల ఉద్యమం సమయంలోనూ దేశాధ్యక్షుడు ఈ టైటిల్‌10ను వాడి నేషనల్‌ గార్డ్‌ బలగాలను ఆయా ఉద్యమప్రాంతాలకు తరలించారు. 

గత అధ్యక్షులు ఐసన్‌హోవర్, జాన్‌ ఎఫ్‌.కెన్నడీ, జాన్సన్‌లూ ఈ నిబంధనను ప్రయోగించారు. 1967 డెట్రాయిట్‌ ఆందోళనలు, మారి్టన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ హత్యానంతరం సైతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎన్‌జీ బలగాలను రప్పించారు. 1970 న్యూయార్క్‌ పోస్టల్‌ ఉద్యమాన్ని అణచివేసేందుకు ఆనాడు ఎన్‌జీ రంగంలోకి దిగింది. చివరిసారిగా 1992లో ఒక నల్లజాతీయుడిని నలుగురు శ్వేతజాతి పోలీసులు దారుణంగా కొట్టినప్పుడు లాస్‌ ఏంజెలెస్‌లో అల్లర్లు చెలరేగినప్పుడు ఎన్‌జీ బలగాలొచ్చాయి. 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు