Breaking News

మదర్సా విద్యార్థులే రక్షణ కవచాలు!

Published on Sun, 05/11/2025 - 03:59

అతివాద నెట్‌వర్క్‌లతో పాక్‌ సైన్యానిది విడదీయరాని బంధమని మరోసారి రుజువైంది. దాయాది యుద్ధోన్మాదం చివరికి మత శిక్షణ సంస్థలను కూడా వదలడం లేదు. భారత్‌తో పోరులో సైన్యం చేతులెత్తేసే పరిస్థితి నెలకొనడంతో పాక్‌ ముసుగులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతు న్నాయి. అవసరమైతే మదర్సా విద్యార్థులను కూడా యుద్ధ రంగంలోకి పంపుతామని బాహాటంగా ప్రకటించేసింది. 

మతిలేని, వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధుడైన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ శనివారం సాక్షాత్తూ పాక్‌ పార్లమెంటులోనే ఈ మేరకు ప్రకటన చేశారు. వారిని ‘సెకండ్‌ లైన్‌ ఆఫ్‌ డిఫెన్స్‌’గా ఆయన అభివర్ణించారు. అవసరమైనప్పుడు మదర్సా విద్యార్థులను యుద్ధ విధుల్లో 100 శాతం వాడుకుని తీరతామని కుండబద్దలు కొట్టారు. భారత డ్రోన్లన్నింటినీ ఎక్కడికక్కడ అడ్డుకుని కూల్చేశామని ఒకవైపు పాక్‌ సైన్యం ప్రకటించగా, అ లాంటిదేమీ లేదంటూ ఆసిఫ్‌ కొట్టిపారేయ డం తెలిసిందే.

 ‘‘భారత డ్రోన్లను కూల్చ కపోవడానికి కారణముంది. మా సైనిక స్థావరాలకు సంబంధించిన సున్ని తమైన సమాచారం లీక్‌ కావద్దనే అలా చేశాం’’ అంటూ విచిత్రమైన వివరణ ఇచ్చి ఇంటాబయటా నవ్వులపాలయ్యా రు. భారత ఫైటర్‌ జెట్లను కూల్చేశామని సీఎన్‌ఎన్‌ ఇంటర్వ్యూలో చెప్పుకుని, రుజువులడిగితే, ‘అలాగని భారత సోషల్‌ మీడియాలోనే వస్తోందిగా’ అని చెప్పి అభాసు పాలయ్యారు. రక్షణ మంత్రి అయ్యుండి సోషల్‌ మీడియా వార్తల ఆధారంగా ప్రకటనలు చేస్తారా అంటూ సీఎన్‌ఎన్‌ విలేకరి ఆండర్సన్‌ నిలదీయడంతో నీళ్లు నమిలారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)