Breaking News

అణ్వస్త్ర రాశులు!

Published on Fri, 03/06/2026 - 06:15

ఇరాన్‌తో అమెరికా అణు చర్చలు చెప్పుకోదగ్గ పురోగతి సాధిస్తున్నా లెక్కచేయకుండా అధ్యక్షుడు ట్రంప్‌ దానిపై ఉన్నట్టుండి యుద్ధానికి తెర తీశారు. ఆ దేశం ఎన్నటికీ అణ్వ్రస్తాలను తయారు చేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఇజ్రాయెల్‌తో కలిసి ఉన్నపళంగా ఇరాన్‌పై అంత స్వేచ్చగా దాడికి దిగగలిగారంటే దానివద్ద అణు బాంబులు లేకపోవడమే కారణమని చెప్పవచ్చు. 

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై మాత్రం ట్రంప్‌ ఎంతగా కత్తులు నూరినా, నాలుగేళ్లుగా కఠిన ఆంక్షలు తదితర చర్యలకే పరిమితమయ్యారే తప్ప ఎన్నడూ యుద్ధానికి దిగే సాహసం చేయలేదు. ఆ దేశం వద్ద అపారంగా పోగుపడ్డ అణ్వాయుధ నిల్వలే అందుకు ప్రధాన కారణమన్నది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అణుపాటవమున్న దేశాలెన్ని, వాటి వద్ద ఎన్ని అణ్వాయుధాలున్నాయి అన్నది ఓసారి చూస్తే...  

అణ్వస్త్ర దేశాల జాబితాలో అగ్రాసనం అమెరికా, రష్యాలదే. ప్రపంచంలోని మొత్తం అణుబాంబుల్లో 90 శాతానికి పైగా ఈ రెండు దేశాల వద్దే పోగుపడ్డాయి! ఆ రెండింట్లో సంఖ్యాబలం రీత్యా రష్యాదే పైచేయి. అమెరికా వద్ద 5,277 అణు బాంబులుంటే రష్యా వద్ద ఏకంగా 5,459 దాకా పోగుపడ్డాయి! అమెరికా తన అణ్వాయుధాలను బెల్జియం, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, టర్కీల్లో కూడా మోహరించి ఉంచడం విశేషం! రష్యా కూడా తన అణ్వాస్త్రాల్లో కొన్నింటిని మిత్ర దేశం బెలారస్‌లో ఉంచింది. ఇతర అణ్వస్త్ర దేశాల్లో ఇజ్రాయెల్, ఉత్తర కొరియా వద్ద ఉన్న అణుబాంబుల సంఖ్యపై కచి్చతమైన స్పష్టత లేదు. 

ఇజ్రాయెల్‌ వద్ద కనీసం 200 అణు బాంబుల తయారీకి అవసరమైన అన్ని వనరులూ ఉన్నట్టు చెబుతారు. ఆ దేశం ఇప్పటికే 90 అణు బాంబులను తయారు చేసిందని అంచనా. ఉత్తర కొరియా కూడా 50 అణు బాంబుల తయారీకి అవసరమైన యురేనియం తదితరాలను పలు మార్గాల సేకరించి ఉంచుకున్నట్టు రక్షణ నిపుణులు చెబుతున్నారు. అణు పాటవమున్న మొత్తం 9 దేశాల వద్దా కలిపి 12,341 అణు బాంబులున్నట్టు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటమిక్‌ సైంటిస్ట్స్‌ 2025 నివేదిక చెబుతోంది. వాటిలో 9,600కు పైగా అణు వార్‌హెడ్‌లు ఏ క్షణంలోనైనా ప్రయోగించేందుకు సిద్ధంగా ఆయా దేశాల సైన్యం నియంత్రణలో ఉన్నట్టు సమాచారం. అయితే ప్రచ్ఛన్నయుద్ధ కాలంతో పోలిస్తే ఇది చాలా తక్కువే కావడం విశేషం. ఆ సమయంలో ప్రపంచ దేశాలన్నింటి దగ్గరా కలిపి ఏకంగా 70 వేల పై చిలుకు అణు వార్‌హెడ్‌లు పోగుపడ్డాయి!

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు