Breaking News

విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్‌, దుబాయ్‌లో సింగర్‌ హఠాన్మరణం

Published on Mon, 09/07/2026 - 15:28

దుబాయ్‌: ప్రముఖ మలయాళీ గాయకుడు నిసార్ వయనాడ్ (Nisar Wayanad) దుబాయ్‌లోని ఒక ఆసుపత్రిలో అకస్మాత్తుగా కన్నుమూశారు. అజ్మాన్‌లో జరగాల్సిన ఒక సంగీత విభావరి (షో)కి కొన్ని గంటల ముందే ఆయన తుదిశ్వాస విడవడం యూఏఈలోని మలయాళీ కమ్యూనిటీని, ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. లైవ్‌ కన్సర్ట్‌  కాస్తా సంతాప సభగా మారిపోయింది.

ఆయన గత నెలలో ఒక సంగీత కార్యక్రమం కోసం దుబాయ్‌కి వచ్చారు. జ్వరం రావడంతో వైద్య చికిత్స తీసుకున్నారు. రాబోయే రోజుల్లో దుబాయ్, సౌదీ అరేబియాలో పలు కార్యక్రమాల్లో ఆయన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.  మలయాళ సినిమాల్లో పాటలు పాడేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. ఇంతలోనే ఆయన ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులను, స్నేహితులను, అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. నిసార్‌ గొంతు ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్ గాత్రాన్ని పోలి ఉండటంతో సంగీత కార్యక్రమాల వేదికలపై ఆయనకు విశేష ప్రజాదరణ ఉండేది.

గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నిసార్, సాధారణ పారాసిటమాల్ మాత్రలు వాడుతున్నారు. శనివారం మధ్యాహ్నంపరిస్థితి విషమించడంతో దుబాయ్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ సాయంత్రం మరణించారు. సెప్టిసీమియా (రక్తంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్) వల్ల అవయవాలు విఫలమై, బాడీలో అసిడోసిస్ పెరగడం వల్ల మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

శనివారం అర్ధరాత్రి వేళ ఆయన మరణవార్త తెలిసిన వెంటనే సుమారు 300 మందికి పైగా అభిమానులు, మిత్రులు తుది వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు. రికార్డు స్థాయిలో కేవలం 4 గంటల్లోనే రాత్రి 3 గంటల ప్రాంతంలో జనాజా ప్రార్థనలు పూర్తి చేసి, పార్థివ దేహాన్ని కేరళలోని ఆయన స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

దుబాయ్‌లోని కల్చరల్ ఈవెంట్లలో తన గాత్రంతో అభిమానులను సంపాదించుకున్న నిసార్‌  కేరళలోని వయనాడ్ జిల్లాకు చెందిన వారు. నిసార్ అసలు పేరు నిస్సార్ అరోత్ ఇబ్రహీం. హిందీ, మలయాళ పాటలతో పాటు ఉదిత్ నారాయణ్, అర్జిత్ సింగ్, అతీఫ్ అస్లామ్ పాటలను అద్భుతంగా పాడేవారు. ఆయనకు భార్య షహానా నిసార్, ఇద్దరు కుమార్తెలు (సింబ్రీనా, అంబ్రీనా) ఉన్నారు.

ఇదీ చదవండి: రూ. 1,470 కోట్ల లాటరీ, సగం దానమిచ్చేసిన టీచరమ్మ!

ప్రముఖుల సంతాపం
ఆయన అకాల మరణం పట్ల ఆర్జే మిథున్ రమేష్, ప్లేబ్యాక్ సింగర్ అఫ్సల్, ఇతర యూఏఈ ఈవెంట్ నిర్వాహకులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : పవిత్ర గంగలో మూడు మునకలు: అనుభూతిని పంచుకున్న జపాన్‌ రాయబారి

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)