6 వేల మీటర్ల లోతులో జపాన్‌ ఘనత : ప్రపంచంలోనే తొలిసారి

Published on Mon, 02/02/2026 - 17:48

జపాన్ సముద్రగర్భ అన్వేషణలో అద్భుతమైన మైలురాయిని అధిగమించి ప్రపంచ రికార్డును సాధించింది.  పరిశోధకుల బృందం 6,000 మీటర్ల లోతునుండి 'రేర్ ఎర్త్' (అరుదైన మూలకాలు,Rare Earth Elements) మూలకాలను కలిగి ఉన్న అవక్షేపాలను (Sediment) విజయవంతంగా వెలికితీసింది. నీటి అడుగున ఖనిజ సేకరణలో ఇది ఒక రికార్డు. ఈ కీలకమైన ఖనిజాల వెలికితీత కొత్త శక్తి సాంకేతికతలు. ఆర్థిక భద్రతకు మార్గం సుగమం చేస్తాయి, విదేశీ సరఫరాదారులపై జపాన్ ఆధారపడటాన్ని తగ్గిస్తాయిని నిపుణులు భావిస్తున్నారు.

ఖనిజాల వేటలో సముద్ర మట్టానికి సుమారు 6,000 మీటర్ల లోతులో ఖనిజాలను సేకరించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి పసిఫిక్ మహా సముద్రం లోని మారుమూల ద్వీపమైన మినామి టోరిషిమా సమీపంలో ఈ తవ్వకాలు జరిగాయి. ఈ ప్రయోగం కోసం 'చిమ్యు' (Chikyu) అనే అత్యాధునిక డ్రిల్లింగ్ నౌకను శాస్త్రవేత్తలు ఉపయోగించారు. ఇంతటి లోతులో ఖనిజాలను సేకరించే ఆపరేషన్నిర్వహించడం ప్రపంచంలోనే తొలిసారి అని అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి : అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా?
ప్రపంచంలోనే తొలి విజయం
ప్రపంచ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డు అని అధికారులు ప్రకటించారు. జపాన్ ఆర్థిక, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (METI), జపాన్ ఏజెన్సీ ఫర్ మెరైన్-ఎర్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ (JAMSTEC) సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. అధునాతన డీప్-సీ డ్రిల్లింగ్ నౌక చిక్యూను ఉపయోగించి, బృందం మారుమూల పసిఫిక్ ద్వీపమైన మినామి టోరిషిమా సమీపంలో ఈ మిషన్‌ను నిర్వహించింది. ఈ పురోగతి కీలకమైన ఖనిజాలలో స్వావలంబన వైపు ఒక అడుగు అని అధికారులు అంటున్నారు. ఇతర దేశాలు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, జపాన్ అత్యధిక లోతులో సరికొత్త రికార్డు నెలకొల్పడం  విశేషం.

ఇదీ చదవండి: భర్తను చితకబాదేసిన భార్య, వైరల్‌ వీడియో

ఈ రేర్‌ఎర్త్‌ మూలకాలు అవసరం ప్రస్తుతం ఆధునిక ప్రపంచానికి చాలా వుంది. ముఖ్యగా ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, స్మార్ట్‌ఫోన్‌లు, సైనిక పరికరాలు , ఇతర హై-టెక్ పరికరాలలో వీటిని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అరుదైన మూలకాల ఉత్పత్తిలో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ విజయంతో జపాన్ ఇక ఇతర దేశాలపై ఆధారపడే అవసరం ఉండదు.
ఇదీ చదవండి: నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు : ఎవరో తెలుసా?

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)