Breaking News

ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధం.. నెతన్యాహు సంచలన ప్రకటన

Published on Sun, 04/07/2024 - 20:56

జెరూసలెం: ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధం ప్రారంభమై ఆదివారం(ఏప్రిల్‌ 7)తో సరిగ్గా ఆరు నెలలు గడిచిన వేళ ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్‌ వద్ద బంధీలుగా ఉన్న తమ పౌరులను విడుదల చేసేదాకా గాజాలో కాల్పుల విరమణకు ఒప్పుకునేలేదని తేల్చిచెప్పారు. ఆదివారం జరిగిన ఇజ్రాయెల్‌ క్యాబినెట్‌ సమావేశానికి ముందు బెంజమిన్‌ నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచ దేశాల ఒత్తిడి తమపై పెరుగుతున్నప్పటికీ హమాస్‌ గొంతెమ్మ కొరికలకు తాము ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు. కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య ఈజిప్టులో తాజా రౌండ్‌ చర్చలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కాగా, గతేడాది అక్టోబర్‌ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన మిలిటెంట్‌ గ్రూపు హమాస్‌ మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే.

ఈ దాడిలో వందల మంది ఇజ్రాయెల్‌ పౌరులను చంపడమే కాకుండా కొంత మంది పౌరులను హమాస్‌ ఉగ్రవాదులు తమ వెంట బంధీలుగా తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్‌ పాలస్తీనాలోని పలు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజాను పూర్తిగా చిధ్రం చేసింది. ఇజ్రాయెల్‌ దాడులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.    

ఇదీ చదవండి.. ఆరు నెలల మారణహోమం.. వేల మరణాలు 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)