Breaking News

రేపు లేదా ఎల్లుండి ఏదైనా జరగొచ్చు: నెతన్యాహు

Published on Mon, 04/20/2026 - 07:33

జెరూసలేం: ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో సాగుతున్న పోరాటం ఇంకా ముగియలేదన్నారు. యుద్ధంలో ఏ క్షణమైనా కొత్త పరిణామాలు చోటుచేసుకోవచ్చని నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో, యుద్ధం మరింత భయంకరంగా ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బెంజిమిన్‌ నెతన్యాహు తాజాగా అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో కలిసి మాట్లాడుతూ..‘ఇరాన్‌పై పోరాటం ఇంకా ముగియలేదు. పోరాటం కొనసాగుతుంది. ఏ క్షణంలోనైనా మరిన్ని పరిణామాలు చోటుచేసుకోవచ్చు. రేపు లేదా ఎల్లుండి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?’ అంటూ పరిస్థితి చాలా ఉత్కంఠభరితంగా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ వ్యతిరేక పోరాటంలో అమెరికా, ఇజ్రాయెల్ తమ లక్ష్యాలను సాధించి తీరతాయని, ప్రపంచ స్వేచ్ఛా ప్రియులకు ఇది కొత్త ఆశలు చిగురింపజేస్తుందని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. లెబనాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడానికి ముందు తాము జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా కమాండర్‌ అలీ రిడా అబ్బాస్‌ మరణించినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోని బింట్‌ జెబీల్‌ పట్టణానికి హెజ్‌బొల్లా కమాండర్‌గా అబ్బాస్‌ ఉన్నట్లు పేర్కొంది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగే చర్యలను ట్రంప్‌ మానుకోవాలని హూతీలు తాజాగా హెచ్చరించారు. లేకపోతే బాబ్‌ అల్‌ మాండెబ్‌ జలసంధిని తాము మూసేస్తామన్నారు. ఒక్కసారి దానిని మూసేస్తే తిరిగి తెరిపించడం ఎవరికీ సాధ్యం కాదని హూతీ ప్రభుత్వ విదేశాంగ శాఖ హుస్సేన్‌ పేర్కొన్నారు.

మరోవైపు.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్‌ వేదికగా రెండో విడత శాంతి చర్చలకు అమెరికా ఇరాన్‌ సన్నద్ధమయ్యాయి. తమ దేశ ప్రతినిధులు సోమవారం పాక్‌కు చేరుకుంటారని, మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. తాము ప్రతిపాదించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ఇరాన్‌కు సూచించారు. లేకపోతే ఆ దేశంలో విద్యుత్‌ కేంద్రాలు, వంతెనలన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.

చర్చలు లేవన్న ఇరాన్‌..
అమెరికా అసంబద్ధ డిమాండ్ల కారణంగానే రెండో విడత చర్చల్లో పాల్గొనవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు ఇరాన్‌ వెల్లడించింది. ‘‘ఆచరణసాధ్యం కాని, మితిమీరిన డిమాండ్లు చేయడం, ఇష్టానికి వైఖరి మార్చుకోవడం వంటి చర్యలు, పరస్పర విరుద్ధ ప్రకటనలు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్‌కు అలవాటుగా మారాయి. దీన్ని ఇకపై ఎంతమాత్రమూ సహించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టింది. తమ ఓడరేవుల దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పందానికి పొడవడమేనని ధ్వజమెత్తింది.
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు