Breaking News

'చేతులు ట్రిగ్గర్ మీదే ఉన్నాయ్‌..' ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ వార్నింగ్

Published on Mon, 10/16/2023 - 15:45

టెహ్రాన్‌: పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు అపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ దురాక్రమణలు ఆపకపోతే పశ్చిమాసియాలోని అన్ని దేశాల చేతులు ట్రిగ్గర్ మీదే ఉన్నాయని  ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ ఘాటుగా స్పందించారు.  

'ప్రస్తుతం గాజాలో నెలకొన్న పరిస్థితిని నియంత్రించడానికి,  యుద్ధం మరింత పెద్దగా మారబోదని చెప్పడానికి ఎవరూ హామీ ఇవ్వలేరు. యుద్ధం మరింత ఉదృతం కాకుండా నిరోధించడానికి ఆసక్తి ఉన్నవారు.. గాజాలో పౌరులకు  వ్యతిరేకంగా జరుగుతున్న అనాగరిక దాడులను నిరోధించాల్సిన అవసరం ఉంది.' అని హొస్సేన్ అమిరబ్డొల్లాహియా అన్నారు.

గాజాపై భూతల దాడులు చేయడానికి ఇజ్రాయెల్ సమాయత్తమవుతోంది. హమాస్‌ ఉనికి లేకుండా చేస్తానని ఓ వైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఈ దాడుల్లో ఇప్పటికే 700 మంది పిల్లలతో 2,670 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌ వైపు 1400 మంది మరణించారు. 

హమాస్ దాడులు వెనక తమ ప్రమేయం లేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటికే స్పష్టం చేశారు. పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ దాడులను తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చారు. హమాస్ బృందాలకు ఆయుధ సరఫరా చేస్తున్నారని ఇరాన్‌ను ఇజ్రాయెల్ మొదటి నుంచీ నిందిస్తోంది.

ఇదీ చదవండి అరబ్ దేశాలపై నిక్కి హేలి ఫైర్‌​‍

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)