Breaking News

ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడి లక్ష్యాలపై ఐరాస ఆందోళన!

Published on Tue, 04/16/2024 - 10:36

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ 300లకు పైగా డ్రోన్లు, మిసైల్స్‌లతో శనివారం దాడి చేసింది. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై  ఇజ్రాయెల్‌ చేసిన దాడికి ప్రతీకారంగా ఇరాన్‌ క్షిపణులతో భీకరంగా విరుచుకుపడింది.  అయితే ఈ దాడులను ఇజ్రాయెల్‌  99 శాతం మిత్ర దేశాల సహకారంతో అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని యోచిస్తున్న ఇజ్రాయెల్‌.. ప్రాంతీయ సంఘర్షణ తీవ్రతరం కాకుండా ఉండేందుకు సంయమనం పాటించాలని మిత్రదేశాల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటోంది.   

ప్రతీకార దాడి చేసేందుకు ఇరాన్‌లోని అణ కేంద్రాలను ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకోవటం పట్ల  తాము ఆందోళన చెందుతున్నామని ఐక్యరాజ్యసమితి  నిఘా విభాగం చీఫ్‌ రాఫెల్ గ్రాస్సీ పేర్కొన్నారు. గత రాత్రి ఇజ్రాయెల్‌  ప్రధానమంత్రి వార్‌ కేబినెట్‌లో ప్రతీకార దాడులకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్  ఇరాన్‌పై ప్రతీకాక దాడి చేయడికి సిద్ధంగా ఉందని ఆ దేశ ఆర్మీ చీఫ్‌ పేర్కొన్నారు.  అమెరికా, ఇండియా, యూకేతో పాటు పలు దేశాలు ఇరాన్‌పై ప్రతీకార దాడులతో పరిస్థితులను తీవ్రతరం చేయవద్దని ఇజ్రాయెల్‌ను  కోరుతున్నాయి.

మరోవైపు.. ఇజ్రాయెల్‌  ఆర్మీ చీఫ్‌ హెర్జి హలేవి స్పందిస్తూ.. ఇరాన్‌పై  ప్రతీకార దాడి చేయడానికి సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే దాడికి ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు నుంచి ఆమోదం ఇంకా లభించలేదని అన్నారు. ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులకు దిగితే తాము సెకండ్లలోనే శనివారం కంటే అతిభీకరమైన దాడులు చేయడానికి కూడా వెనకాడబోమని ఇరాన్‌ హెచ్చరిస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)