చర్చలకు ఇరాన్‌ నో

Published on Mon, 04/20/2026 - 05:34

వాషింగ్టన్‌: రెండో విడత చర్చలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రతిపాదనను ఇరాన్‌ తిరస్కరించింది. ఆదివారం ఈ దిశగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో చర్చలు జరుగుతాయని తొలుత ట్రంప్‌ ప్రకటించారు. తమ ప్రతినిధులు స్టీవ్‌ విట్కాఫ్, జేర్డ్‌ కుష్నర్‌ సోమవారం సాయంత్రంకల్లా ఇస్లామాబాద్‌ చేరతారన్నారు. వాటిలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కూడా పాల్గొంటారని అనంతరం వైట్‌హోస్‌ పేర్కొంది. అనంతరం ఇరాన్‌ స్పందిస్తూ, తాము ఈ చర్చల్లో పాల్గొనబోమని స్పష్టం చేసింది. 

అమెరికా తమ ఓడరేవుల దిగ్బంధాన్ని కొనసాగించినంత కాలం ఎలాంటి చర్చలనూ అంగీకరించబోమని కుండబద్దలు కొట్టింది. ఆ దేశ అధికార వర్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ ఈ మేరకు వెల్లడించింది. శాంతి ఒప్పందానికి ఇరాన్‌ ముందుకు రాకపోతే ఆ దేశంలోని వంతెనలు, విద్యుదుత్పత్తి ప్లాంట్లను నామరూపాల్లేకుండా ధ్వంసం చేస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. అమెరికా, ఇరాన్‌ కాల్పుల విరమణ గడువు ఈ నెల 22తో ముగియనుంది. అమెరికా, ఇరాన్‌ మధ్య ఇటీవల ఇస్లామాబాద్‌లోనే జరిగిన చర్చలు విఫలం కావడం తెలిసిందే. అణు కార్యక్రమాన్ని శాశ్వతంగా పక్కన పెట్టాలన్న అమెరికా డిమాండ్‌కు ఇరాన్‌ అంగీకరించలేదు. 

విరమణకు ఇరాన్‌ తూట్లు: ట్రంప్‌ 
హార్మూజ్‌ జలసంధి గుండా ప్రయాణిస్తున్న నౌకలపై ఐఆర్‌జీసీ కాల్పులు జరపడంపై ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్‌ ఉల్లంఘించిందని మండిపడ్డారు. ‘‘మేము న్యాయమైన, సహేతుకమైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నాం. ఇరాన్‌ అంగీకరిస్తుందని ఆశిస్తున్నా. లేదంటే ఇకపై మేం ఎంతమాత్రం మంచివాళ్లం కాదు.’’ అన్నారు.

హార్మూజ్‌ ఉద్రిక్తం
హార్మూజ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. వందలాది నౌకలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. హార్మూజ్‌లో శనివారం భారత్‌ సహా పలు దేశాల నౌకలపై ఇరాన్‌ కాల్పులు జరపడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. 

అసంబద్ధ డిమాండ్ల వల్లే: ఇరాన్‌ 
అమెరికా అసంబద్ధ డిమాండ్ల కారణంగానే రెండో విడత చర్చల్లో పాల్గొనవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు ఇరాన్‌ వెల్లడించింది. ‘‘ఆచరణసాధ్యం కాని, మితిమీరిన డిమాండ్లు చేయడం, ఇష్టానికి వైఖరి మార్చుకోవడం వంటి చర్యలు, పరస్పర విరుద్ధ ప్రకటనలు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్‌కు అలవాటుగా మారాయి. దీన్ని ఇకపై ఎంతమాత్రమూ సహించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టింది. తమ ఓడరేవుల దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పందానికి పొడవడమేనని ధ్వజమెత్తింది.

బయటకు వెళ్లిపో!
హార్మూజ్‌  జలసంధిలో రెండు భారత నౌకలపై ఇరాన్‌ కాల్పులు జరపడం పట్ల స్పందించాలని కోరిన మహిళా విలేకరిపై ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే బయటకు వెళ్లిపోమ్మంటూ మండిపడ్డారు. ట్రంప్‌ రియాక్షన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)