Breaking News

అమెరికా హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్

Published on Sat, 07/11/2026 - 11:09

టెహ్రాన్‌: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్‌ స్టేజ్‌ చేరుకున్నాయి. యుద్ధ విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ కూడా గట్టిగా స్పందించింది. అమెరికా ఎలాంటి సైనిక చర్యలకు దిగినా తగిన ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ కీలక నేతలు హెచ్చరించారు.

ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, చర్చల బృందానికి నేతృత్వం వహిస్తున్న మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై దాడి జరిగితే దానికి తగిన సమాధానం ఇస్తామని, ఒత్తిళ్లు, బెదిరింపులతో తమను వెనక్కి తగ్గించలేరని ఆయన హెచ్చరించారు. హార్మూజ్‌ జలసంధి తిరిగి సాధారణ స్థితికి రావాలంటే ఇరాన్ షరతులు, ఏర్పాట్లను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం తర్వాత కూడా వివాదాలు పూర్తిగా చల్లారలేదు. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఒప్పంద ఉల్లంఘనల ఆరోపణలు చేసుకుంటున్నాయి. అమెరికా వైపు నుంచి కొత్త హెచ్చరికలు రావడం, ఇరాన్ నుంచి ప్రతీకార చర్యల ప్రకటనలు రావడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి ఈ వివాదానికి కేంద్రంగా మారింది. ఈ మార్గం ద్వారా భారీ స్థాయిలో చమురు రవాణా జరుగుతుండటంతో అక్కడి పరిస్థితులు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా హార్మూజ్‌లో స్వేచ్ఛాయుత నౌకా రవాణాకు హామీలు కోరుతుండగా, ఇరాన్ మాత్రం తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది.

మరోవైపు దౌత్య మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదు. ట్రంప్ చర్చలు కొనసాగించేందుకు ఇరాన్‌తో అంగీకారం కుదిరిందని చెబుతున్నప్పటికీ, కాల్పుల విరమణ ముగిసిందని కూడా స్పష్టం చేశారు. దీంతో ఒకవైపు చర్చలు, మరోవైపు సైనిక హెచ్చరికలు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. తాజా పరిణామాలు కేవలం రెండు దేశాల మధ్య వివాదంగా కాకుండా, మధ్యప్రాచ్య భద్రత, ప్రపంచ చమురు సరఫరా, అంతర్జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అంశంగా మారాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)