Breaking News

అరుణాచల్‌ ప్రదేశ్‌ మాది..!

Published on Mon, 11/24/2025 - 11:40

అరుణాచల్‌ ప్రదేశ్‌.. భారతదేశ ఈశాన్య రాష్ట్రాలలో ఒకటి. అయితే చైనా మాత్రం అరుణాచల్‌ ప్రదేశ్‌పై ఎప్పటికప్పుడు అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. మనతో స్నేహం అంటూనే భారతదేశంలో సూర్యుడు ఉదయించే తొలి ప్రాంతం అరుణాచల్‌ను తరచు తమది అంటోంది. తాజాగా వారి అరాచకం మరోసారి బయటపడింది. 

యూకేలో ఉంటున్నభారత​ సంతతికి చెందిన అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన మహిళను చైనా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తీవ్ర ఇబ్బందులు పెట్టారు.  ఆమె పాస్‌పోర్ట్‌పై అరుణాచల్‌ప్రదేశ్‌-భారతదేశం అని ఉండటంతో చైనా అధికారుల కోపం కట్టలు తెంచుకుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ అనేది చైనాలో బాగమని ఆమెతో వాదించారు.  ఆ పాస్‌పోర్ట్‌ చెల్లదు అంటూ తీవ్ర అసహనానికి గురిచేశారామెను. 

పెమా వాంఘజామ్‌ థోంగ్‌డాక్‌ అనే లండన్‌ నుంచి జపాన్‌కు వెళ్తున్న సమయంలో ఇది చోటు చేసుకుంది. మధ్యంతర విరామంలో భాగంగా చైనాలోని షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో మూడు గంటలు పాటు వేచి ఉన్న ఆమెకు.. చైనా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. పాస్‌పోర్ట్‌ కౌంటర్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌-భారత్‌ అని ఉందేంటని ప్రశ్నించారు. భారతదేశంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ భాగమని ఆమె వాదించగా,  కాదంటూ వారు వాగ్వాదానికి దిగారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ చైనాలో భాగమంటూ వితండ వాదం చేశారు.  మూడు రోజుల క్రితం అంటే నవంబర్‌ 21వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఈ విషయాన్ని ఆమె.. జాతీయ వార్త సంస్థ ఇండియా టుడేకి స్పష్టం చేసింది. తనను చైనా అధికారుల ఎంతటి వేధింపులకు గురి చేశారో వెల్లబుచ్చింది. 

గత ఏడాది తాను చైనా మీదుగా ప్రయాణించినా ఎటువంటి ఇబ్బంది రాలేదని, అలాగే లండన్‌లో ఉన్న చైనా ఎంబాసీ కూడా ఎప్పుడూ తనను ఇబ్బంది పెట్టలేదని తెలిపింది. తాజాగా ఎదురైన అనుభవంతో తాను షాక్‌కు గురైనట్లు ఆమె వాపోయింది.  

ఈ కారణంగా తాను కేవలం  కొంత పరిధి వరకే పరిమితమయ్యానని, టికెట్లను రీబుక్‌ చేసుకోలేకపోయానని, భోజనం కూడా కొనలేకపోయానని, ఆఖరకు టెర్మినల్స్‌ మధ్య కదలడానికి కూడా వీల్లేకుండా పోయిందని తెలిపింది. 

చైనా ఈస్టర్న్‌లో ప్రత్యేకంగా కొత్త టికెట్ కొనాలని అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని, అలా చేసిన తర్వాతే తన పాస్‌పోర్ట్ తిరిగి ఇస్తామన్నారని పేర్కొంది. దీనివల్ల పలు ఆటంకాలు ఏర్పడి ఆర్థిక నష్టం చవిచూడాల్సి వచ్చిందన్నారు. 

చివరకు లండన్‌లో ఉన్న తన ఫ్రెండ్‌ సాయంతో షాంఘైలో ఉన్న బారత ఎంబాసీని కలిశానని, ఆ తర్వాత అర్థరాత్రి సమయంలో తాను చైనాను వీడి వెళ్లే అవకాశం దక్కిందన్నారు. ఇదొక భయానక ఘటనగా ఆమె అభివర్ణించారు.

ఇదీ చదవండి: 
మీరు మాకు చెప్పాల్సింది: ప్రధాని మోదీతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు

సరిహద్దులు మారొచ్చు.. రాజ్‌నాథ్‌ సింగ్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)