Breaking News

62 రోజులుగా మిస్సింగ్‌ : భారత సంతతి మహిళ విషాదాంతం

Published on Sat, 10/31/2026 - 13:12

కాలిఫోర్నియాలో కనిపించకుండా పోయిన భారత సంతత మహిళ అనుమానాస్పద స్థితిలో శవమైన ఘటన విషాదాన్ని నింపింది. ఆగస్టు నుంచి కనిపంచకుండా పోయిన 72 ఏళ్ల భారత సంతతి వృద్ధురాలు అజిత్ కౌర్ మృతదేహాన్ని ఒక కాలువలో అధికారులు గుర్తించారు. అజిత్ కౌర్ అనే మహిళ మృతదేహాన్ని అక్టోబర్ 24, శనివారం కనుగొన్నట్లు సెరెస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (CPD) తెలిపింది.

పోలీసుల సమాచారం ప్రకారం సీరెస్ (Ceres) నగరం పరిధిలోని కాసా గ్రాండే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ నుంచి అజిత్ కౌర్ ఆగస్టు 23న అదృశ్యమయ్యారు. ఆ రోజు రాత్రి 1:45 గంటల ప్రాంతంలో విట్మోర్ అవెన్యూ, మిట్చెల్ రోడ్ సమీపంలో ఆమె చివరిసారిగా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. టర్లాక్ ఇరిగేషన్ డిస్ట్రిక్ట్ (TID) ఉద్యోగి ఒకరు తన రోజువారీ తనిఖీల్లో భాగంగా కాలువ వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా, సెంట్రల్ అవెన్యూ - కీస్ రోడ్ సమీపంలోని 'లోయర్ లాటరల్ 3' కాలువలో మృతదేహం తేలియాడుతూ ఉండగా గుర్తించారని పోలీసులు తెలిపారు. అనంతరం, మృతదేహాన్ని స్టానిస్లాస్ కౌంటీ కరోనర్ కార్యాలయానికి (SCCO) తరలించగా, అక్టోబర్ 27న అది అజిత్ కౌర్‌దేనని గుర్తించారు.

ఇదీ చదవండి: 5 స్టార్‌ హోటల్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో షాక్‌ : ఇద్దరు విదేశీయులు దుర్మరణం

పోలీసుల దర్యాప్తు
అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ తూర్పు వైపు ఉన్న TID కాలువలోకి అజిత్ కౌర్ ప్రమాదవశాత్తు పడిపోయి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానించారు. డాగ్ స్క్వాడ్‌ సహా  పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక పరిసరాలతో పాటు కాలువ ప్రాంతాలన్నింటినీ జల్లెడ పట్టారు. స్టానిస్లాస్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్ డైవ్ యూనిట్ సాయంతో నీటి అడుగున పనిచేసే సోనార్ డ్రోన్‌లను ఉపయోగించి కాలువల్లో వెతికారు. నీటి ప్రవాహ మార్గాలను అంచనా వేసేందుకు TID అధికారులతో కలిసి మ్యాపింగ్ కూడా చేశారు.

మరోవైపు ఈ బాధాకరమైన సమయంలో అజిత్ కౌర్ కుటుంబ సభ్యులకు, బంధువులకు సీరెస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తమ సానుభూతిని ప్రకటించింది. అలాగే దర్యాప్తులో సహకరించిన ఇతర భద్రతా విభాగాలకు పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. 

ఇదీ చదవండి: పూజకు పూలు కోస్తూ బాల్కనీ నుంచి పడి తండ్రీ కొడుకులు మృతి

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)