కాల్పుల విరమణ: బైడెన్‌ వ్యాఖ్యలను ఖండించిన హమాస్‌

Published on Wed, 08/21/2024 - 07:41

న్యూయార్క్: ఇజ్రాయెల్‌-గాజా కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన వ్యాఖ్యలను హమాస్‌ తీవ్రంగా ఖండించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. 

సోమవారం  చికాగోలో జరిగిన డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌ సమావేశం అనంతరం ఎయిర్‌పోర్టులో బైడెన్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇజ్రాయెల్‌-గాజా కాల్పుల విరమణ ఒప్పందం నుంచి పాలస్తీనా( హమాస్‌) ఎనక్కి తగ్గుతోంది.కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ ఒప్పుకుంది. ఒప్పందం కోసం  సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఒప్పందంపై హమాస్‌ వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఏం జరగుతుందో చూద్దాం. ఈ  కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని అన్నారు. 

అయితే బైడెన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించటం లేదని హమాస్‌ తెలిపింది. అదేవిధంగా తమకు జూలై 2న సమర్పించిన ఒప్పంద ప్రతిపాదన ఇటీవలి కొత్త ప్రతిపాదనకు చాలా విరుద్దంగా ఉంది. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కొత్త షరతులు, గాజా పట్ల నేర ప్రణాళికకు అమెరికా అంగీకరిస్తున్నట్లు తెలుస్తోందని పేర్కొంది. బైడెన్ చేసిన వ్యాఖ్యలు తప్పుదారి పెట్టించేలా ఉన్నాయని తెలిపింది. మరోవైపు.. కాల్పుల విరమణ, బంధీల విడుదలకు సంబంధించి విభేదాలు తలెత్తకుండా అమెరికా విదేశాంగ మంత్రి అంటోని బ్లింకెన్‌ చర్చల కోసం కసరత్తు చేస్తున్నారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)