చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
అమాంతం వేల అడుగుల కిందకు.. దుబాయ్–టెల్‌అవీవ్ విమానంలో కలకలం
Published on Wed, 09/30/2026 - 12:47
సాక్షి, న్యూఢిల్లీ: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంతో తాజాగా జరిగిన ఓ పరిణామం తీవ్ర కలకలం రేపింది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో అత్యవసర పరిస్థితి నెలకొంది. విమానం తొలుత ఎమర్జెన్సీ కోడ్ పంపింది. కొద్దిసేపటికే హైజాక్ కోడ్ పంపడంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన ఘటన ఉగ్రవాద చర్యేనన్న అంశంపై ఇజ్రాయెల్ భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఒమన్‌కు చెందిన సహ పైలట్ విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ప్రధాన పైలట్ సిబ్బంది, కొంతమంది ఇజ్రాయెల్ ప్రయాణికుల సాయంతో అక్కడి పరిస్థితులను తమ అధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఘటనపై సౌదీ అరేబియాలో జరుగుతున్న దర్యాప్తులో ఇజ్రాయెల్ అధికారులు కూడా పాల్గొంటున్నారు.
ఫ్లై దుబాయ్‌కి చెందిన ఎఫ్‌జెడ్ 1073 విమానం బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయానికి బయలుదేరింది. విమానంలో 174 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 27 మంది చిన్నారులు ఉన్నారు. ప్రయాణంలో భాగంగా విమానం అకస్మాత్తుగా భారీగా కిందికి దిగింది. సుమారు 34,000 అడుగుల ఎత్తు నుంచి కొద్ది సమయంలోనే 14,000 అడుగులకు పడిపోయింది. ఒక దశలో నిమిషానికి 30,976 అడుగుల వేగంతో కిందికి దిగినట్లు విమాన పర్యవేక్షణ వివరాలు చూపించాయి.
జోర్డాన్ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత విమానం మొదట అత్యవసర పరిస్థితిని సూచించే 7700 సంకేతాన్ని ప్రసారం చేసింది. అనంతరం విమానాన్ని హైజాక్ చేసినట్లు సూచించే 7500 సంకేతాన్ని పంపింది. దీంతో ఇజ్రాయెల్‌లో భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. వైమానిక దళానికి చెందిన 2 యుద్ధ విమానాలను కూడా గాల్లోకి పంపించారు.
కాక్‌పిట్‌లో భారీగా రక్తం
విమానం తర్వాత సౌదీ అరేబియా వైపు మళ్లీ, తక్కువ ఎత్తులో ప్రయాణించింది. చివరకు తబూక్ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. ప్రయాణికుల కథనాల ప్రకారం కాక్‌పిట్‌లో భారీగా రక్తం కనిపించింది. దుబాయ్‌కు చెందిన విమానయాన సంస్థ కూడా విమానంలో హింసాత్మక ఘటన జరిగినట్లు ధ్రువీకరించింది.
విమానంలో ఉన్న మిరియం అనే ప్రయాణికురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కాక్‌పిట్ నుంచి అరుపులు వినిపించాయని, అక్కడికి వెళ్లినప్పుడు భారీగా రక్తం కనిపించిందని చెప్పారు. ఒక వ్యక్తి పైలట్‌ను చిన్న కత్తితో పొడిచినట్లు ఆమె పేర్కొన్నారు. “విమానం కూలిపోతుందని అనిపించింది. నేను ‘షెమా ఇజ్రాయెల్’ అని అరిచాను” అని ఆమె చెప్పింది. వైద్యుడు, నర్సు పైలట్‌కు ప్రాథమిక చికిత్స అందించారని, ఇజ్రాయెల్ ప్రయాణికులు సిబ్బందితో కలిసి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని ఆమె వివరించారు.

ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రయాణికులను సౌదీ అరేబియా నుంచి తిరిగి తీసుకురావడానికి సైనిక విమానాలను పంపాలని ఆదేశించారు. ఈ ఘటన ఉగ్రవాద చర్యగా నిర్ధారణ అవుతుందా, విమానంలో అసలు ఏం జరిగిందనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
🚨✈️🇦🇪🇮🇱 Un vol Flydubai reliant Dubaï à Tel-Aviv a déclenché le code d’urgence signalant un possible détournement alors qu’il transportait environ 180 passagers.
L’appareil a été dérouté vers l’Arabie saoudite. pic.twitter.com/JCAcaidYT0— KRONIK Insights (@KRONIKInsights) September 30, 2026
పైలట్ల మధ్య గొడవ?
విమానంలో ఏం జరిగిందన్న దానిపై ప్రాథమికంగా భిన్న కథనాలు వెలువడ్డాయి. కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య భౌతికంగా గొడవ జరిగినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఘటన నేపథ్యంలోనే.. నొక్కుకుపోయి ఎమర్జెన్సీ సిగ్నల్ పంపినట్లు సమాచారం. 7500 కోడ్ సాధారణంగా హైజాక్ సమయంలో ఉపయోగిస్తారు. అందుకే ఇజ్రాయెల్ అధికారులు తొలుత అప్రమత్తమయ్యారు. అయితే అసలు విమానంలో ఏం జరిగిందన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
UPDATE: The plane has landed safely in Saudi Arabia. The assessment in Israel is that the emergency signal on the plane was activated during a violent altercation between the pilots in the cockpit, and not due to a highjacking. https://t.co/Cz2W33I5qO
— Ariel Oseran أريئل أوسيران (@ariel_oseran) September 30, 2026
ఇదీ చదవండి: ఇండియన్ సినిమాలు.. ఓ ఆటాడుకుంటున్న ఇరాన్!
Tags : 1