Breaking News

వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమే, కానీ రిస్క్‌ అంటున్న మస్క్‌

Published on Sat, 01/24/2026 - 16:42

టెస్లా అధినేత, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)లో అరంగేట్రం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్, గురువారం 2026 WEF సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. బ్లాక్‌రాక్ సీఈఓ లారీ ఫింక్‌తో సంభాషణ సందర్భంగా, మానవుల్లో వృద్ధ్యాప్యాన్ని తిప్పికొట్టే అవకాశం ఉందంటూ ఎలాన్‌ మాస్క్‌ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

 లారీ ఫింక్‌తో జరిగిన చర్చలో మాస్క్ వృద్ధాప్యం అనేది చాలా సులభంగా పరిష్కరించగల సమస్యే కానీ రిస్క్‌తో కూడుకున్నదన్నారు. వృద్ధాప్యానికి కారణమేమిటో మనం గుర్తించినపుడు  ఏజింగ్‌ రివర్స్‌ ప్రక్రియ సులభ మవుతుందని తాను భావిస్తున్నా అన్నారు. వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమే కానీ మరణానికి సామాజిక ప్రయోజనం ఉంది. అయితే ఇది అంత చిన్న విషయం కాదని ఎందుకంటే శరీరంలోని అన్ని కణాలు దాదాపు ఒకే రేటుతో వృద్ధాప్యానికి గురవుతాయి. బాడీలోని 35 ట్రిలియన్ కణాలన్నీ ఒకే వేగంతో వృద్ధాప్యానికి గురవు తాయని, దీని వెనుక ఒక ఖచ్చితమైన 'క్లాక్' (యంత్రాంగం) ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కనిపెడితే వృద్ధాప్యాన్ని అరికట్టడం సాధ్యమేనని చెప్పారు.

సమాజానికి ముప్పు
అయితే ఏజ్‌ రివర్సింగ్‌ వల్ల సామాజిక సవాళ్లు, ఊహించని పరిణామాలు ఏర్పడతాయని కూడా ఆయన హెచ్చరించారు. వృద్ధాప్యం లేకపోతే కొత్త ఆలోచనలు రాకుండా సమాజం "స్తంభించిపోయే" (Ossification) ప్రమాదం ఉందని, మరణం అనేది సమాజంలో కొత్తదనం రావడానికి అవసరమని  మస్క్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సెలబ్రిటీలను సైతం ఇన్‌స్పైర్‌ చేసిన 70 ఏళ్ల బామ్మ

దావోస్ సదస్సును గతంలో "బోరింగ్" అని విమర్శించిన  మస్క్, మొదటిసారి ఈ వేదికపై ప్రసంగించడం విశేషం. దావోస్‌లో జరిగిన తన మొదటి WEFలో మస్క్ వయస్సు మార్పు , దీర్ఘాయువు గురించి మాట్లాడారు. అలాగే భవిష్యత్తులో మనుషుల కంటే రోబోలే ఎక్కువ ఉంటాయని, 2027 నాటికి టెస్లా రోబోలు మార్కెట్లోకి వస్తాయని మాస్క్ అంచనా వేశారు. అలాగే ఈ చర్చ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ విధానాలపై విమర్శలు గుప్పించారు.

ఇదీ చదవండి: క్రూర హంతకుల జైలు ప్రేమ, పెళ్లి : 15 రోజుల స్పెషల్‌ పెరోల్‌

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)