Breaking News

ఇజ్రాయెల్‌కు సాయం చేయకండి: అరబ్‌ దేశాలకు ఇరాన్‌ హెచ్చరిక

Published on Sat, 10/12/2024 - 11:00

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పాలస్తీనా, లెబనాన్‌లపై వైమానిక దాడులతో  ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతుంటే.. ఇరాన్‌ ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఈనేపథ్యంలో ఇరాన్ పొరుగున ఉన్న అరబ్‌ దేశాలకు, అమెరికా మిత్ర దేశాలకు  తీవ్ర హెచ్చరికలు చేసింది.

తమపై(ఇరాన్‌) దాడులు జరిపేందుకు ఇజ్రాయెల్‌కు సాయం చేయవ ద్దని హెచ్చరించింది. అలా కాదని అరబ్‌ దేశాలు వారి భూబాగాలు, గగనతలాన్ని ఉపయోగించి దాడులకు పాల్పడితే తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్,  ఖతార్ వంటి చమురు సంపన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని రహస్య దౌత్య మార్గాల ద్వారా ఈ హెచ్చరికను పంపింది. అయితే ఇవన్నీ యూఎస్‌ సైనిక దళాలకు ఆతిథ్యం ఇచ్చే దేశాలు.

ఇజ్రాయెల్‌ దాడుల్లో హెజ్‌బొల్లా అధినేత నస్రల్లా మృతి అనంతరం ఇరాన్‌ 200 బాలిస్టిక్‌ మిస్సైళ్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్‌ పెద్దతప్పు చేసిందని, భారీ మూల్యం చెల్లించుకుంటుందని, ప్రతీకార దాడి తప్పదని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు పేర్కొన్నారు. 

అయితే ఇరాన్‌లోని అణుస్థావరాలతో పాటు.. చమురు క్షేత్రాలనూ లక్ష్యంగా చేసుకొనే అవకాశం ఉందని ఐడీఎఫ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథయంలోనే ఇస్లామిక్ రిపబ్లిక్‌పై ఎలాంటి దాడులు జరగకూడదని,అలా జరిగితే ప్రతీకార దాడులకు పాల్పడతామని అరబ్‌ దేశాలను హెచ్చరించింది.

 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)