Breaking News

చైనాతో జాగ్రత్త.. కెనడాకు ట్రంప్‌ హెచ్చరిక

Published on Sat, 01/24/2026 - 07:33

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కెనడాను టార్గెట్‌ చేశారు. కెనడాపై విరుచుకుపడ్డారు. గ్రీన్‌లాండ్‌పై గోల్డెన్‌ డోమ్‌ నిర్మించడాన్ని కెనడా వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో చైనాతో కెనడా వ్యాపారం చేయడం వారికే నష్టం కలిగిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియాలో ట్రుత్‌ వేదికగా.. గ్రీన్‌లాండ్‌పై విస్తారమైన క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించాలనే అమెరికా ప్రణాళికను కెనడా వ్యతిరేకిస్తోంది. అయినప్పటికీ గోల్డెన్ డోమ్ కెనడాను రక్షిస్తుంది. అమెరికా నిర్మిస్తున్న గోల్డెన్‌ డోమ్‌.. కెనడాను రక్షించబోతోంది. కెనడా మా నుండి చాలా ఉచితాలను పొందుతుంది. అమెరికా కారణంగానే కెనడా మనుగడ సాగిస్తోంది. వారు కూడా కృతజ్ఞతతో ఉండాలి. అలా కాకుండా అమెరికాతో సంబంధాలను తెంచుకుకుంటున్నారు. బదులుగా చైనాతో వ్యాపారం చేసేందుకు కెనడా ఆమోదం తెలిపింది. చైనాకు అనుకూలంగా ఓటు వేశారు. మొదటి సంవత్సరమే కెనడాను చైనా తినేస్తుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ చైనాతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించడానికి బీజింగ్‌ను సందర్శించిన కొన్ని రోజుల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మరోవైపు.. ట్రంప్‌ వ్యాఖ్యలపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా స్పందించారు. అమెరికా మద్దతు కారణంగానే కెనడా మనుగడ సాగిస్తుందనే ట్రంప్ వాదనను తిరస్కరించారు. ఈ ‍క్రమంలో మార్క​్‌ కార్నీ మాట్లాడుతూ..‘కెనడాకు అమెరికాతో సంబంధమే లేదు. మనం కెనడియన్లం కాబట్టి కెనడా అభివృద్ధి చెందుతుంది. కెనడా సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం. కెనడాకు మనమే యజమానులం. ఇది మన సొంత దేశం. ఇది మన భవిష్యత్తు అంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే, దావోస్‌లో ట్రంప్‌ పేరు ప్రస్తావించకుండానే చిన్న దేశాల పట్ల గొప్ప శక్తులు బలవంతం చేయడాన్ని కార్నీ తప్పుబట్టారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)