Breaking News

లాటరీకి స్వస్తి.. హెచ్‌–1బీ కోసం కొత్త విధానం!

Published on Wed, 09/24/2025 - 06:03

వాషింగ్టన్‌: అత్యంత నైపుణ్యమున్న విదేశీయులకే హెచ్‌–1బీ వీసా ప్రక్రియలో అధిక ప్రాధాన్యత కల్పించాలని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే హెచ్‌–1బీ వీసా వార్షిక రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్‌ సర్కార్‌ తాజాగా తక్కువ నైపుణ్యమున్న విదేశీయులకు హెచ్‌–1బీ వీసా దక్కకూడదనే కుట్రకు తెరతీసింది. ఏటా ఇచ్చే 85వేల హెచ్‌–1బీ వీసాల పరిమితిదాటాక సంస్థల నుంచి వచ్చే అభ్యర్థనల్లో అత్యధిక నైపుణ్యంతో అధిక వేతనాలు పొందగల వారికే హెచ్‌–1బీ వీసాలు జారీచేయాలని ట్రంప్‌ ప్రభుత్వం ప్రతిపాదించింది.

 ఈ మేరకు పాత లాటరీ విధానానికి స్వస్తిపలికి అధిక నైపుణ్యం, అధిక వేతనం ఉన్న వాళ్లకే హెచ్‌–1బీ వీసాలను కట్టబెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు మంగళవారం ఫెడరల్‌ రిజిస్టర్‌ నోటీస్‌ వెలువడింది. ‘‘ లాటరీ విధానానికి బదుల వెయిటేజీ విధానానికి ప్రాధాన్యత కల్పించాలి. అమెరికన్‌ సంస్థలు కోరే అభ్యర్థుల్లో అత్యధిక నైపుణ్యమున్న విదేశీ కారి్మకులకు మాత్రమే హెచ్‌–1బీల జారీలో అధిక వెయిటేజీ ఇవ్వాలి. 

అమెరికాకు వచ్చాక 1,62,528 డాలర్ల వార్షిక వేతనం పొందబోయే అభ్యర్థులకే వెయిటేజీ పూల్‌లో నాలుగుసార్లు ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ వేతన కారి్మకులకు వెయిటేజీ పూల్‌లో ఒక్కసారే అవకాశం ఇవ్వాలి. కిందిస్థాయి ఉద్యోగాల ఎంపికలో అమెరికన్‌ పౌరులకు తగు ప్రాధాన్యత కల్పించాలి. అసంబద్ధమైన విదేశీ కారి్మకుల జీతభత్యాల పోటీ నుంచి అమెరికన్లను కాపాడాలి అని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. ఉద్యోగి వేతన స్థాయికి అనుగుణంగా రిజి్రస్టేషన్‌లో ప్రాధాన్యత కల్పించడం వంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. 
 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)