Breaking News

భారత్‌తో యుద్ధం తప్పదు! 

Published on Thu, 10/09/2025 - 05:23

ఇస్లామాబాద్‌: భారత్‌తో త్వరలో యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని పాకిస్తాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ అన్నారు. ఈసారి యుద్ధం జరిగితే పాకిస్తాన్‌ గతంకంటే మంచి ఫలితాలు సాధిస్తుందని తెలిపారు. మంగళవారం సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలు నిజంగానే ఉన్నాయి. పరిస్థితిని ఉద్రిక్తం చేయటం నా ఉద్దేశం కాదు. కానీ ప్రమాదం ఉన్నమాట నిజం. నేను దానిని తోసిపుచ్చలేను. ఒకవేళ యుద్ధమే వస్తే.. దేవుడి దయవల్ల మనం గతంకంటే మంచి ఫలితాలు సాధిస్తాం. గత ఆరు నెలల క్రితంకంటే ఇప్పుడు పాకిస్తాన్‌కు ఎక్కువమంది మద్దతుదారులు, మిత్రులు ఉన్నారు. గత మే నెలలో చోటుచేసుకున్న ఘర్షణ సమయంతో పోల్చితే భారత్‌ ఇప్పుడు మద్దతుదారులను కోల్పోయింది’అని పేర్కొన్నారు. 

భారత్‌ ఒకేదేశం కాదు 
మధ్యయుగంలో మొఘల్‌ పాలకుడు ఔరంగజేబు పాలనలో తప్ప భారత్‌ ఎప్పుడూ ఒకేదేశంగా లేదని ఖవాజా చెప్పుకొచ్చారు. కానీ, అల్లా దయతో ఏర్పడిన పాకిస్తాన్‌ ఒకే ఐక్య రాజ్యంగా ఉంటూ అంతర్గతంగా ఎన్ని సమస్యలు ఉన్నా ఇటీవలి సైనిక ఘర్షణ సమయంలో ఐక్యంగా నిలబడిందని పేర్కొన్నారు. ప్రపంచ పటంలో పాకిస్తాన్‌ ఉండాలంటే ఉగ్రవాదానికి మద్దతిచ్చే చర్యలను మానుకోవాలని ఇటీవల భారత సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించిన విషయం తెలిసిందే.

 భారత్‌ వాయుసేన అధిపతి కూడా గత శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో అమెరికా ఇచ్చిన ఎఫ్‌–16 సహా పాకిస్తాన్‌కు చెందిన 12 యుద్ధ విమానాలను కూల్చివేశామని తెలిపారు. అదేరోజు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్‌ తన పౌరులను రక్షించుకునేందుకు ఏ దేశ సరిహద్దునైనా దాటి వెళ్లగలదని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఖవాజా యుద్ధం వస్తుందని ఊహించినట్టు అంచనా వేస్తున్నారు.  
ట్రంప్‌ అండతోనే.. 
ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తాను బెదిరించటంవల్లే రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు పదేపదే ప్రకటించుకుంటున్నారు. అంతటితో ఆగకుండా పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ను తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌కు లంచ్‌కు కూడా పిలిచాడు. ఆ తర్వాత కూడా పాక్‌ ప్రధాని, సైన్యాధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు. దీంతో మళ్లీ భారత్‌తో యుద్ధం జరిగితే ట్రంప్‌ తమకు సాయం చేస్తారని ఖవాజా పరోక్షంగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇటీవల సౌదీ అరేబియాతో పాక్‌ సైన్య సహకార ఒప్పందం చేసుకుంది. అందువల్లే యుద్ధం జరిగితే మంచి ఫలితాలు సాధిస్తామని ఖవాజా ప్రగల్భాలు పలికారని రక్షణరంగ నిపుణులు పేర్కొంటున్నారు.  

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)