Breaking News

ఆస్ట్రేలియాపై ఇజ్రాయెల్‌ సంచలన ఆరోపణలు

Published on Sun, 12/14/2025 - 17:33

జెరూసలేం: ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్‌ దాడి ఘటనపై ఇజ్రాయెల్‌  తీవ్రంగా స్పందించింది. ఆస్ట్రేలియాపై ఇజ్రాయెల్‌ సంచలన ఆరోపణలు చేసింది. ముందే అలర్ట్‌ చేయడంతో ఆస్ట్రేలియా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. యూదుల వేడుకలను టార్గెట్‌ చేసిన ఉ‍గ్రమూక దాడిలో  10 మంది మృతిచెందగా.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు.

యూదులపై దాడులు జరగవచ్చని ఆస్ట్రేలియాకు ముందే హెచ్చరికలు ఇచ్చామని.. యాంటీ-సెమిటిజాన్ని అరికట్టడంలో చర్యలు తీసుకోలేదని ఇజ్రాయెల్‌ విమర్శించింది. ఈ సందర్భంగా సిడ్నీ కాల్పుల ఘటనపై ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ ట్వీట్‌ చేశారు. సిడ్నీ కాల్పుల ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇప్పటికైనా ఆస్ట్రేలియా ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలి’అని పేర్కొన్నారు. 

మరోవైపు, సిడ్నీ ఉగ్రదాడిని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ తీవ్రంగా ఖండించారు. యూదులపై అత్యంత క్రూరమైన దాడిగా అభివర్ణించారు. ఆస్ట్రేలియా అధికారులు యాంటీ-సెమిటిజాన్ని ఎదుర్కోవడంలో మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మన సోదరులు, సోదరీమణులు.. ఉగ్రవాదుల చేతిలో అత్యంత క్రూరమైన దాడికి గురయ్యారు’ అంటూ హెర్జోగ్ యెరూషలేములో జరిగిన ఒక కార్యక్రమంలో విచారం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాను వేధిస్తున్న ‘యాంటీ-సెమిటిజం’ని ఎదుర్కోవడానికి పోరాడాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ ఉగ్రదాడి యూదులే లక్ష్యంగా జరిగిందా? అనేదానిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

బాండీ బీచ్‌లో కాల్పుల ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ అన్నారు. ఈ ఘటన దృశ్యాలు కలచివేస్తున్నాయని.. బాధితులకు తన ప్రగాఢ సానుభూతి’’ అంటూ అల్బనీస్ ట్వీట్ చేశారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)