Breaking News

ఘటనపై దర్యాప్తు ముమ్మరం

Published on Mon, 10/05/2026 - 05:43

దుబాయ్‌: ఫ్లై దుబాయ్‌ విమాన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పలుదేశాలు ఇందులో పాలుపంచుకున్నాయి. యూఏఈ నేతృత్వంలోని దర్యాప్తు సంస్థలు నిందితుడైన కో–పైలట్‌ హమామీ ఉద్దేశాలు, ఇతరులతో అతడికి ఉన్న సంబంధాలపై దృష్టి పెట్టింది. ఒమన్‌కు చెందిన కో–పైలట్‌కు ఆ్రస్టేలియాతో ఉన్న సంబంధాలు, అతడు టెల్‌ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమాన సిబ్బందిలో ఎలా చేరాడనే దానిపై ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌ అధికారులు విచారణ జరుపుతున్నారు. 

నిందితుడికి ఆస్ట్రేలియాతో ఉన్న సంబంధాలపై ఉగ్రవాద నిరోధక బృందం దర్యాప్తు చేస్తోందని ఆ్రస్టేలియన్‌ ఫెడరల్‌ పోలీస్‌ విభాగం వెల్లడించింది. విమానంలోని కాక్‌పిట్‌లో కో–పైలట్‌ క్రాష్‌ గొడ్డలితో కెప్టెన్‌పై దాడి చేసి, విమానంపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నించాడని యూఏఈ అటార్నీ జనరల్‌ హమద్‌ సైఫ్‌ అల్‌ షంసీ పేర్కొన్నారు. కుట్ర కోణం త్వరలో బహిర్గతమయ్యే అవకాశం ఉందని తెలిపారు. 

ఫ్లై దుబాయ్‌ విమాన ఘటనకు ముందు యూఏఈ అధికారులు అందులోని ప్రయాణికులు, సిబ్బంది వివరాలను ఇజ్రాయెల్‌తో పంచుకున్నారని సంబంధిత అధికారులు ఆదివారం తెలిపారు. తీవ్రవాద భావజాలం ఉన్న కో–పైలట్‌ను అతడి సొంత దేశమే విమానం నడపకుండా నిషేధించిందని ఇప్పటికే గుర్తించారు. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేని ఒమన్‌ పౌరుడిని, ఇజ్రాయెల్‌ పౌరులతో నిండిన విమానాన్ని నడపడానికి ఎలా అనుమతించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)