Breaking News

బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. హిందూ జర్నలిస్ట్ హత్య..!

Published on Mon, 01/05/2026 - 22:59

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. తాజాగా బంగ్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. మరో వ్యక్తిని దారుణంగా కాల్చి చంపిన ఘటన చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఐస్‌ ఫ్యాక్టరీ నిర్వహిస్తూ ఓ బంగ్లా డైలీకి తాత్కాలిక ఎడిటర్‌గా పనిచేస్తున్న రాణా ప్రతాప్‌ బైరాగి (38) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఇవాళ సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్థానిక ఏఎస్పీ అబుల్‌ బసర్‌ వెల్లడించారు. ఈ ఘటనతో బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని జెస్సోర్ జిల్లాలోని మోనిరాంపూర్ ఉపజిల్లాలో జరిగింది. ఈ ఘటనలో జర్నలిస్ట్ రాణా ప్రతాప్ బైరాగి అనే హిందూ యువకుడిని దుండగులు కాల్చి చంపారు. కాగా.. ప్రతాప్‌పై పలు పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని.. అతడు నరైల్‌ జిల్లా నుంచి వెలువడే ఓ దిన పత్రికకు తాత్కాలిక సంపాదకుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సదరు పత్రిక న్యూస్‌ ఎడిటర్‌ అబుల్‌ మాట్లాడారు. రాణా ప్రతాప్‌ తమ పత్రిక సంపాదకుడని తెలిపారు. ఒకప్పుడు అతడిపై  పలు కేసులు ఉన్నప్పటికీ నిర్దోషిగా బయటపడ్డారని వెల్లడించారు. అయితే ఈ హత్యకు దారి తీసిన కారణాలు ఏమిటనేది మాత్రం తనకు తెలియదని అన్నారు. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)