Breaking News

అంతా ట్రంప్‌ చలవే.. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం: ‘నోబెల్‌ శాంతి’ విజేత

Published on Fri, 10/10/2025 - 21:13

నోబెల్‌ శాంతి పురస్కారం ప్రకటన తర్వాత వైట్‌హౌస్‌ నుంచి విమర్శల వాన  కురిసింది.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కాకుండా వెనెజులా ప్రతిపక్ష నేత, ఆ దేశంలో ప్రజాస్వఘ్యానికి పాటుబడ్డ మరియా కొరీనా మచోడాకు నోబెల్‌ శాంతి పురస్కారం లభించడమే అందుకు కారణం.

నోబెల్‌ శాంతి పురస్కారాన్ని ప్రకటించే క్రమంలో సదరు కమిటీ రాజకీయ దురుద్దేశంతోనే మరియాకు ఆ ప్రతిష్టాత్మక బహుమతిని కేటాయించిందని మండపడింది వైట్‌హౌస్‌. శాంతి అవార్డుల్లో కూడా పాలిటిక్స్‌ను జోడించారని విమర్శించింది. 

ఇదిలా ఉంచితే, మరియా పదే పదే ట్రంప్‌పై గతంలో ప్రశంసలు కురిపించిన ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. వెనెజులా శాంతి స్థాపనలో ట్రంప్‌ కృషి వెలకట్టలేనిదని నోబెల్‌ శాంతి పురస్కారం గెలుచుకున్న మరియా ప్రశంసించిన ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ‘ అంతా మీ చలవే.. ట్రంప్‌ను గుర్తుపెట్టుకుంటాం’ అంటూ ఆమె చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ మారాయి. 

2025 నోబెల్ శాంతి పురస్కారం విజేత మరియా కొరీనా మచాడో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి పలు సందర్భాల్లో కొనియాడారు. ముఖ్యంగా వెనిజులా ప్రజాస్వామ్య పోరాటానికి ఆయన మద్దతును కొనియాడారు..  ట్రంప్‌ను “వెనిజులా స్వేచ్ఛకు అత్యంత గొప్ప అవకాశంగా” ఆమె అభివర్ణించారు. ట్రంప్ పాలనలో మడురో ప్రభుత్వంపై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగి, ప్రజాస్వామ్య స్వేచ్ఛకు దోహదపడిందన్నారు.

 

ఇక ట్రంప్‌కు నోబెల్‌ శాంతి పురస్కారం దక్కకపోవడంతో రకరకాలుగా ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. ‘ నా నోబెల్‌ నాకు కావాలి’ అంటూ ట్రంప్‌ను ట్రోల్స్‌ చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి: 

మరియా కొరీనా మచాడోకు నోబెల్‌ శాంతి పురస్కారం

నోబెల్ బహుమతి వెనుక రాజకీయ కుట్ర?.. ట్రంప్ సంచలన ఆరోపణ!

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)