Breaking News

Israel-Iran Conflict: పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల మూసివేత

Published on Tue, 06/17/2025 - 11:12

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం ఐదో రోజుకు చేరుకుంది. ఆ దేశాలు ప్రతీకార చర్యలతో రగిలిపోతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్‌పోర్టులను మూసివేయడంతో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో గగనతలాలపై ఆంక్షలు విధించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తమ గగనతలాన్ని ఇరాన్‌ పూర్తిగా మూసివేయగా.. అత్యంత కీలకమైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇజ్రాయెల్‌ మూసివేసింది. దీంతో లెబనాన్‌, జోర్డాన్‌, ఇరాక్‌లోనూ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. మరో​ వైపు, తమ అణు స్థావరాలను ధ్వంసం చేయడంతో అత్యున్నత సైనికాధికారులను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్‌కు తగిన గుణపాఠం నేర్పాలన్న టార్గెట్‌తో సోమవారం ఉదయం క్షిపణుల వర్షం కురిపించింది.

టెల్‌ అవీవ్, పెటా తిక్వా ప్రాంతాల్లో భారీగా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ఈ దాడుల్లో కనీసం ఎనిమిది మంది ఇజ్రాయెల్‌ పౌరులు మృతిచెందారు. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో టెహ్రాన్‌ విమానాశ్రయమే లక్ష్యంగా టెల్‌ అవీవ్‌ దాడులు చేసింది. రెండు ఎఫ్‌-14 యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ విడుదల చేసింది.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)