Breaking News

OP Sindoor: పాక్‌ కవర్‌ డ్రైవ్‌ .. భలే బెడిసి కొట్టిందిగా!

Published on Wed, 06/11/2025 - 16:17

ఆపరేషన్‌ సిందూర్‌ ఓ విఫల ప్రయత్నమని.. పైగా తాము జరిపిన ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్‌తో భారత్‌కు భారీగా నష్టం వాటిల్లిందని పాకిస్తాన్‌ నెల రోజులుగా ప్రచారం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఫేక్‌ ఫొటోలతో, అసత్య ప్రచారాలతో ప్రపంచ దేశాల దృష్టిలో నవ్వులపాలు అవుతూ వస్తోంది.  తాజాగా మరోసారి అదే రిపీట్‌ అయ్యింది.

అబ్బే.. భారత సైన్యం అసలు తమ ఎయిర్‌బేస్‌లపై దాడులే జరపలేదని పాక్‌ చెబుతున్న సంగతి తెలిసిందే.  ఆ దాడులను కవరింగ్‌ చేసుకునే ప్రయత్నం ఇప్పుడు బయటపడింది.  ఆపరేషన్‌ సిందూర్‌లో మురిద్‌, జాకోబాబాద్‌, భోళరిలో మిలిటరీ స్థావరాలను భారత్‌ నాశనం చేసింది. అయితే ధ్వంసమైన ఈ ఎయిర్‌బేస్‌లను టార్పలిన్‌(tarpaulin)లతో కప్పి దాచేసే ప్రయత్నం చేసింది పాక్‌. 

ఇండియా టుడే జరిపిన శాటిలైట్‌ చిత్రాల విశ్లేషణలో అవి పైకప్పు కాదని, టార్ఫలిన్‌లు అని తేలింది. అదీ వాటి పైకప్పు ఆకుపచ్చ, గోధుమ రంగులో మ్యాచ్‌ అయ్యేలా చూసుకుంది పాక్‌ ఆర్మీ. అయినప్పటికీ శాటిలైట్‌ చిత్రాల ద్వారా విషయం   బయటపడింది. 'ది ఇంటెల్ ల్యాబ్'కు చెందిన జియో ఇంటెలిజెన్స్‌ పరిశోధకుడు డామియన్ సైమన్ ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. దాడి తర్వాత దెబ్బతిన్నవాటిని పునరుద్ధరించకుండానే.. కేవలం టార్పలిన్‌తో కవర్‌ చేశారని సోషల్‌మీడియాలో ఆయనొక పోస్ట్‌ చేశారు. 

ఇదంతా చూస్తున్న కొందరు బాలీవుడ్‌ అభిమానులు.. పర్దే మేన్‌ రహ్నే దో, పర్దా న ఉటావో అంటూ పాట పాడుతూనే..  పర్దా తొస్తే అసలు విషయం బయటపడుతుందంటూ పాక్‌ను ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు.. పాకిస్థాన్‌ ఆర్థికాభివృద్ధిని పణంగా పెట్టి.. ఆయుధాల కొనుగోళ్లపై దృష్టిపెట్టింది. దేశ రక్షణ బడ్జెట్‌ను 20 శాతం పెంచింది. ఏకంగా 9 బిలియన్‌ డాలర్లకు కేటాయించింది. షెహ్‌బాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాక్‌ ప్రభుత్వం ఆ దేశ ఫీల్డ్‌ మార్షల్‌ అసిమ్‌ మునీర్‌ డిమాండ్లను సంతృప్తిపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ బడ్జెట్‌లో పెంచిన నిధులతో ఆపరేషన్‌ సిందూర్‌లో దెబ్బతిన్న టెర్రర్‌ క్యాంప్‌లను మళ్లీ పునరుద్ధరించనుందని తెలుస్తోంది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు