రెండేళ్ల నిరీక్షణ.. రూ.24 లక్షలు గెల్చుకున్నాడు

Published on Mon, 01/05/2026 - 14:59

దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న భారతీయుడికి జాక్‌పాట్‌ తగిలింది. లాటరీలో ఒకటీ రెండూ కాదు ఏకంగా పాతిక లక్షల రూపాయలను గెల్చుకున్నాడు. గత రెండేళ్లుగా లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తున్న 57 ఏళ్ల బషీర్‌ను ఎట్టకేలకు అదృష్టదేవతవరించింది.

కేరళకు చెందిన  బషీర్ కైపురత్ గత పాతికేళ్లుగా యూఏఈలో నివసిస్తున్నాడు. అతని వృత్తి డ్రైవర్.  ఏదో ఒక రోజు ఫలితం దక్కకపోతుందా అనే ఆశతో  ప్రతీ నెలా క్రమం తప్పకుండా బిగ్ టికెట్ టిక్కెట్లను కొనుగోలు  చేయడం అతనికి అలవాటు. చివరికి రెండేళ్లకు పైగా తన అదృష్టాన్ని   పరీక్షించుకుంటున్న అతని  కల ఫలించింది. బిగ్ టికెట్ ఈ-డ్రాలో  276640 నంబర్ టిక్కెట్‌తో   Dh100,000 (సుమారు రూ. 24 లక్షలు) గెలుచుకున్నాడు. 

చదవండి: అధికారులే షాక్‌ : పౌర్ణమి, గుప్త నిధులు, 8 నెలల బాలుడు

ఆసక్తికర విషయం ఏమిటంటే.. 'రెండు కొంటే మూడు ఉచితం అనే పరిమిత కాల  ఆఫర్‌ కింద దీన్ని కొనుగోలు చేశాడు. ఈ నిర్ణయం అతని జీవితాన్ని మార్చేసింది. ఈ డ్రా గెల్చుకున్నట్టు ఫోన్‌ రాగానే తొలుత తాను అస్సలు నమ్మలేదని ఆ గెలుపును ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా అంటూ  పట్టరాని సంతోషాన్ని ప్రకటించాడు. ఈ డబ్బులో కొంత భాగాన్ని భారతదేశంలోని తన కుటుంబానికి ఇవ్వాలని భావిస్తున్నాడు. ఓపిక, పట్టుదల తప్పకుండా గెలుస్తాయంటున్నాడు. అంతేకాదు భవిష్యత్తులో కూడా   డ్రాలలో కూడా పాల్గొంటానని చెప్పాడు.

ఇంతకు ముందు గుజరాత్‌కు చెందిన 52 ఏళ్ల కంప్యూటర్ టీచర్ రితేష్ ధనక్ సుమారు రూ. 25 లక్షలు గెలుచుకున్నాడు. గత 30 సంవత్సరాలుగా తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో నివసిస్తున్న రితేష్, దశాబ్దానికి పైగా క్రమం తప్పకుండా బిగ్ టిక్కెట్లను కొనుగోలు చేసే అలవాటున్న రితేష్‌ తన స్నేహితులతో కలిసి దీన్ని కొనుగోలు చేసి, గెల్చుకున్నాడు. 

ఇదీ చదవండి: గాయని చిత్ర అయ్యర్‌ సోదరి దుర్మరణం, ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌

కాగా బిగ్ టికెట్ యూఏఈలోని అత్యంత ప్రజాదరణ పొందిన రాఫెల్ డ్రాలలో ఒకటి. ఇందులో గెలుపొందిన విజేతలు భారీ నగదు బహుమతులు, లగ్జరీ కార్లను దక్కించుకోవచ్చు. ఇది అబుదాబిలో ఉన్నప్పటికీ, దుబాయ్‌తో సహా దేశవ్యాప్తంగా ఇది ఆకర్షిస్తుంది. ఈ డ్రాలు నెలవారీగా జరుగుతాయి. 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు న్నవారు ఈ టిక్కెట్లను అధికారిక బిగ్ టికెట్ వెబ్‌సైట్ ద్వారా లేదా అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం,  లేదా ఎంపిక చేసిన అధీకృత అవుట్‌లెట్‌లలో వీటిని కొనుగోలు చేయవచ్చు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)