Breaking News

అణ్వస్త్రాలతో సర్వత్రా కలవరం!

Published on Sat, 03/14/2026 - 00:31

పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర ఘర్షణలు ప్రపంచాన్ని మరోసారి అణ్వస్త్ర యుద్ధం ముంగిట నిలిపాయి. అణు శక్తి సదుపాయాలపై దాడులు జరిగిన సూచనలు ఇంతవరకు అయితే ఏవీ లేవని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) పేర్కొంది. అయితే, ఈ ప్రాంతీయ యుద్ధంలో అణ్వస్త్రాల ప్రయోగానికి అవ కాశం హెచ్చుగానే ఉంది. ఇరాన్, ఇజ్రా యెల్‌తో పాటు సైనిక దాడులను ఎదు ర్కొంటున్న ఆ ప్రాంతంలోని అనేక ఇతర దేశాల్లో అణు విద్యుదు త్పాదన కేంద్రాలున్నాయి. అణు పరిశోధనా రియాక్టర్లతో పాటు, అణు ఇంధన స్టోరేజి సదుపాయాలున్నాయి. ఇరాన్‌–ఇజ్రాయెల్‌తో పాటు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో నాలుగు అణు రియాక్టర్లున్నాయి. జోర్డాన్, సిరియా, బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియాలు ఏదో ఒక రూపేణా అణుశక్తిని వినియోగించుకుంటున్నాయి. 

‘ఫిసైల్‌’పై చర్చలు ముగియక ముందే..!
ఇరాన్‌ అణ్వాయుధాల కార్యక్రమానికి ఆలంబనగా నిలుస్తు న్నట్లు అనుమానిస్తున్న సదుపాయాలపై ఇజ్రాయెల్‌–అమెరికా 2025 జూన్‌లో వైమానిక దాడులకు దిగినపుడు కూడా ఇదే రకమైన ఆందోళనలు పొడసూపాయి. రష్యా–ఉక్రెయిన్‌ వంటి ఇతర అణ్వా యుధ ప్రయోగావకాశ ఘర్షణలు గత ఏడాది కూడా గుబులు రేపాయి. బులెటిన్‌ ఆఫ్‌ ఆటమిక్‌ సైంటిస్ట్స్‌ అనే బృందం అణు వినాశనం సంభవించగల సమయానికి సంబంధించిన అంచనా లను వెల్లడిస్తూ ఉంటుంది. ఇరాన్‌ శుద్ధి చేసినట్లుగా భావిస్తున్న 400కు పైగా కిలోల యురేనియంను దృష్టిలో పెట్టుకుని, 2026 జనవరిలో ఓ రోజు అర్ధరాత్రికి 85 సెకన్ల ముందు అది ఆ అవకా శాన్ని సవరించింది. శుద్ధి చేసిన యురేనియంలో 60 శాతం ఫిసైల్‌ యురేనియం 235 ఐసోటోప్‌ ఉంది. అంటే, దాన్ని మరింత శుద్ధి చేయనవసరం లేకుండానే ఆ యురేనియంతో పెక్కు అణ్వా యుధాలు తయారు చేయవచ్చు. ఈ ఫిసైల్‌ పదార్థ వాడకం గురించి ఓ పక్క చర్చలు కొనసాగుతూండగానే ఇరాన్‌పై ఇటీవల అమె రికా–ఇజ్రాయెల్‌ దాడులకు దిగాయి. 

గత ఏడాదే ముంచుకొచ్చిన ముప్పు!
ఇరాన్‌లో అణుశక్తి మౌలిక వసతులు విస్తృతంగానే ఉన్నాయి. అది పైకి ప్రకటించిన సదుపాయాలే 13 నడుస్తున్నాయి. టెహ్రాన్‌ రిసెర్చ్‌ రియాక్టర్, ప్రాసెస్‌ రిసెర్చ్‌ ఫెసిలిటీ, మోలిబ్డెనమ్‌ అయోడిన్‌ అండ్‌ జినాన్‌ (ఎం.ఐ.ఎక్స్‌.) రేడియో ఐసోటోప్‌ ప్రొడక్షన్‌ ఫెసిలిటీ, జబార్‌ ఐబిన్‌ హయన్‌ మల్టీపర్పస్‌ ల్యాబొరేటరీస్, మినియేచర్‌ న్యూట్రాన్‌ సోర్స్‌ రియాక్టర్, లైట్‌ వాటర్‌ సబ్‌–క్రిటికల్‌ రియాక్టర్, హెవీ వాటర్‌ జీరో పవర్‌ రియాక్టర్, 10 మెగావాట్ల ఇస్పహాన్‌ రిసెర్చ్‌ రియాక్టర్, కరాజ్‌ వాటర్‌ స్టోరేజి ఫెసిలిటీ, బుషెహర్‌ అణు విద్యు దుత్పాదన కేంద్రానికి చెందిన నాలుగు యూనిట్లు, కరున్‌ న్యూక్లి యర్‌ పవర్‌ ప్లాంట్‌ వంటివి ఆ కోవలోకి వస్తాయి. గత ఏడాది జూన్‌లో జరిగిన దాడుల్లో ఫోర్డౌ వంటి కొన్ని సదుపాయాలు దెబ్బ తిన్నాయి. కోర్‌ రియాక్టర్లు చెక్కు చెదరకపోవడంతో అణు ధార్మికత లీక్‌ అవలేదు. సంరక్షణ చర్యలకు వీలుగా ఇరాన్‌ ఆ తర్వాత నూతన ఇస్పహాన్‌ అణు ఇంధన శుద్ధి కేంద్రం గురించి ఐఏఈఏకి తెలియ జేసింది. కానీ, ఆ కేంద్రం తనిఖీ ప్రక్రియ ఇంకా మొదలు కానేలేదు. తాజా విడత దాడుల్లో ఇస్పహాన్‌ లేదా మరి ఏ ఇతర అణు శక్తి సదుపాయమైనా దెబ్బతిన్నదీ లేనిదీ ఇంకా స్పష్టం కాలేదు. 

గడువు తీరిన ‘తగ్గింపు ఒడంబడిక’ 
మరొకవైపు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం వంటి అంత ర్జాతీయ ఒడంబడికల వల్ల సాధించిన పురోగతి ఏమీ కనిపించడం లేదు. పైగా, కొన్ని దేశాలు తమ అణ్వాయుధాలకు సాంకేతిక పరంగా మరింతగా పదును పెట్టుకుంటున్నాయి. ఈ స్థితిలో కొత్త అణ్వాయుధ పోటీ మొదలైనా ఆశ్చర్యపోనక్కర లేదు. ఇటువంటి వాటిలో కడపటి ఒప్పందంగా చెప్పదగిన, అమెరికా–రష్యాల మధ్య నున్న నూతన వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒడంబడిక (న్యూ స్టార్ట్‌) గడువు 2026 ఫిబ్రవరి 5తో ముగిసింది. ఇన్నాళ్లూ (1971 నుంచి) ఆ ఒడంబడిక ఆ రెండు దేశాల అణ్వాయుధ శక్తులను పరి మితం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ రెండు దేశాలూ తమ వద్ద ఉంచుకోదగిన వ్యూహాత్మక అణ్వాయుధాల సంఖ్యకు సంబంధించి ఎటు వంటి పరిమితికీ చట్టబద్ధంగా కట్టుబడి ఉండనవ సరం లేదు. 

‘పరిమితం’తో ఒరిగేదేమీ లేదు!
అసలు రష్యా–ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం మొదలవడంతోనే పరిమిత అణుయుద్ధ భావన తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఇరాన్‌ విషయంలోనూ అది చర్చకు వస్తోంది. పూర్తి స్థాయిలో ప్రపంచ అణు యుద్ధానికి పురికొల్పకుండా, తమ నిర్దిష్ట సైనిక లేదా రాజ కీయ లక్ష్యాల సాధనకు పరిమితమైన రీతిలో అణ్వాయుధాలను ఉపయోగించుకుని యుద్ధం చేయడం గురించిన ఆలోచన 1980ల నుంచి ఉంది. వ్యూహాత్మక, రక్షణ నిపుణులు అడపాదడపా దానిపై చర్చిస్తూనే ఉన్నారు. పరిమిత అణు యుద్ధంలో పాల్గొనే దేశాలు తాము ప్రయోగించే అణ్వాయుధాల సంఖ్యలో, అవి విడు దల చేయగల శక్తిలో, లక్ష్యాలను ఎంచుకోవడంలో కొంత నిగ్రహాన్ని పాటిస్తాయన్నమాట. సిద్ధాంతపరంగా దాన్ని ‘పరిమిత’ యుద్ధంగానే పరిగణించవచ్చునేమో కానీ, అణ్వాయుధాల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా వినాశనాన్ని సృష్టించగలదు. 

దౌత్యం ఒక్కటే నివారణ మార్గం!
ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితి తీవ్ర ఆందోళనదాయకంగా ఉంది. అణు ధార్మికత విడుదలకు గల అవకాశాన్ని ఐఏఈఏ తోసిపుచ్చలేదు. పెద్ద నగరాలను మించిన విస్తృత ప్రాంతాల నుంచి జనాన్ని ఖాళీ చేయించవలసి ఉంటుంది. ఇరాన్‌ అణ్వాయుధాలను సమకూర్చుకోకూడదన్నదే (మొదట్లో అనుకున్నట్లుగా) అమె రికా, దాని మిత్రపక్షాల లక్ష్యమైతే, ఐఏఈఏ డైరెక్టర్‌ జనరల్‌ రఫేల్‌ మరియానో గ్రాసి చెప్పినట్లుగా, రెండు పక్షాలూ దౌత్యానికీ, చర్చ లకూ తప్పనిసరిగా తిరిగి ఉపక్రమించాలి. అణు జ్వాల రేగకుండా నివారించేందుకు అదొక్కటే నివారణ మార్గం. 

దినేశ్‌ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్‌ అంశాల వ్యాఖ్యాత 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)