Breaking News

138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో

Published on Fri, 05/09/2025 - 14:54

ప్రస్తుత కాలంలో అందర్నీ భయపెడుతున్న సమస్య అధిక బరువు. జీవన శైలి, ఆహార అలవాట్లు, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు పెరిగిపోతున్నారు.  చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే ఈ బాధలనుంచి విముక్తి పొందేందుకు, స్లిమ్‌గా కనిపించేందుకు భారీ కసరత్తులే  చేస్తున్నారు. అంతేకాదు  బరువు తగ్గడంతో తాము సాధించిన విజయాలను  సోషల్‌ మీడియాలో  పంచుకుంటున్నారు.  14 నెలల్లో 63 కిలోలు తగ్గిన మహిళ  వెయిట్‌ లాస్‌ జర్నీ నెట్టింట వైరల్‌గా మారింది. ఈమె కథ చాలా  హైలైట్‌గా నిలిచింది.   కొన్ని టిప్స్‌ను కూడా ఇన్‌స్టాలో షేర​్‌ చేసింది.  అవేంటో  తెలుసుకుందాం ఈ కథనంలో.

ఫిట్‌నెస్ మోడల్ నెస్సీ చుంగత్  వెయిట్‌ లాస్‌ జర్నీ  చాలా  స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది. 138 కిలలో బరువున్న  ఆమె కష్టపడి 75 కిలోలకు చేరింది. 2023లో నవంబరులో మొదలు పెట్టి, 2025 జనవరి నాటికి అంటే 14 నెలల్లో ఏకంగా 63  కిలోల బరువు తగ్గించుకుంది. "138 కిలోల నుండి బరువు తగ్గే ప్రయాణం అంత సులభం కాదు" అని నెస్సీ తన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.  ఈ వీడియోను  40 లక్షలమంది వీక్షించారు.  బరువు తగ్గాలనే స్థిర చిత్తం, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, బలమైన సంకల్ప శక్తి ద్వారా 63 కిలోల  బరువును తగ్గించుకుంది. "ఇది ఒక మైండ్ గేమ్" అని చెబుతుంది నెస్సీ.

‘‘ఇక నేను చేయలేను .. ఆపేస్తా..’’అని చాలాసార్లు అనిపించినా .. ఆమె దివంగత తల్లి ఊబకాయం సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా బాధపడిన తీరు గుర్తొచ్చి, తన ప్రయత్నాన్ని కొనసాగించింది. తన సొంత అనుభవంతో రూపొందించుకున్న నిబంధనలు, సూత్రాల ద్వారా నెస్సీ తన  ఫ్యాట్‌ను తగ్గించుకునే ప్లాన్‌కు కట్టుబడి ఉంది.   చివరికి అనుకున్నది సాధించింది.

ఇదీ చదవండి: రెండేళ్ల వయసులో అనాథలా ఆశ్రమానికి : కట్‌ చేస్తే..!

మూడంటే..మూడు  టిప్స్‌
షుగర్‌కు చెక్‌: ముఖ్యంగా మూడే మూడు  డైట్ చిట్కాలు పాటించినట్టు నెస్సీ చెప్పుకొచ్చింది.  చక్కెరను తగ్గించండి, కానీ ఆనందాన్ని , సంతోషాన్ని కాదు సుమా. రోజువారీ  ఆహారం నుంచి చక్కెను పూర్తిగా తొలగించాలి.  కానీ వారానికి ఒక కేక్ ముక్క లేదా చిన్న చాక్లెట్ ముక్క తినవచ్చు.

ఉదయాన్నే వేడి నీళ్లు : ఉదయం గోరువెచ్చని నీటితో ప్రారంభించాలి. ఇది ఒక చిన్న అడుగే, కానీ జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. ఇది వెయిట్‌లాస్‌కు బాగా ఉపయోగపడుతుంది.

చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్‌స్పైరింగ్ జర్నీ

ట్రస్ట్‌ది ప్రాసెస్‌: మీరు పాటిస్తున్న పద్ధతిపై విశ్వాసాన్ని కోల్పోకండి. అద్దాన్ని కాదు.. నమ్మేది.. ట్రస్ట్‌ది ప్రాసెస్ మొదలు పెట్టిన తొలినెలలో మార్పు కనిపించకపోతే.. భయపడకండి అంటుంది ఆమె. ఆ నమ్మకమే తనకు బాగా ఉపయోగపడిందని నెస్సీ వెల్లడించింది. తక్షణం వచ్చే ఫలితంపై కాకుండా, నిరాశపడకుండా, దీర్ఘకాలిక లక్ష్యంపై గురి పెట్టి తన శరీర బరువును తగ్గించుకున్న నెస్సీ స్టోరీ  నెటిజనులను బాగా ఆకర్షిస్తోంది.

నోట్‌ : బరువు పెరగడం, తగ్గడం అనేది శరీరతత్వం, మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి శరీరం భిన్నంగా ఉంటుందనే గమనించాలి. ఆరోగ్య మార్పులు, వ్యాయామం, విశ్వాసం ప్రధాన పోషిస్తాయి. ఏదైనా కొత్త ఆహారం లేదా ఫిట్‌నెస్ దినచర్యను ప్రారంభించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)