Breaking News

షార్జాలో మరో విషాదం : బర్త్‌డే రోజే కేరళ మహిళ అనుమానాస్పద మరణం

Published on Mon, 07/21/2025 - 16:22

షార్జాలో మరో మలయాళీ మహిళ  మరణం  ఆందోళన  రేపుతోంది. కేరళకు చెందిన అతుల్య శేఖర్ శనివారం తెల్లవారు జామున యుఎఇలోని షార్జా అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఆమె భర్తపై హత్య కేసు నమోదు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు.

గల్ఫ్ న్యూస్ ప్రకారం, అతుల్య 30వ పుట్టినరోజే కన్నుమూసింది. అదీ కొత్త ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఆమె అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. మహిళ తల్లి దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం,ఆమె భర్త సతీష్ ఆమెను గొంతు  పిసికి, కడుపుపైతన్నాడు, తలపై ప్లేట్‌తో కొట్టాడు, ఫలితంగానే ఆమె మరణించింది. మృతురాలికి పదేళ్ల కుమార్తె కూడా ఉంది. అతుల్య ఏకైక కుమార్తె ఆరాధిక (10) ప్రస్తుతం కొల్లాంలో తన అమ్మమ్మ, తాతాయ్య రాజశేఖరన్ పిళ్లై , తులసి భాయ్‌లతో ఉంది అతుల్య మరణం భారతీయ సమాజాన్ని మరోసారి దిగ్భ్రాంతికి గురిచేసిందని గల్ఫ్ న్యూస్ నివేదించింది.

చదవండి:  లవ్‌ ప్రపోజల్‌ తిర​‍స్కరించిన ఇండియన్‌ టెకీకి బాస్‌ చుక్కలు : నెటిజన్లు ఏమన్నారంటే

2014లో సతీష్‌, అతుల్య వివాహం జరిగింది. భర్త సతీష్‌తో  కలిసి షార్జాలో నివసిస్తోంది అతుల్య   అప్పటినుంచీ బైక్‌, 43 తులాల బంగారం ఇచ్చినప్పటికీ, తగినంత కట్నం తీసుకురాలేదని పదేపదే వేధించే వారని అతుల్య కుటుంబం ఆరోపిస్తోంది. అల్లుడు  మద్యానికి బానిస అని ఎప్పుడూ కొడుతూ ఉండేవాడని అతుల్య తండ్రి ఆరోపించారు.పాప కోసంమే తన బిడ్డ అన్ని హింసలను భరించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.   ఈ వేధింపులకు సంబంధించి గతంలో ఇరు కుటుంబాల మధ్య చర్చలకు జరిగాయి.  పోలీసు కేసు కూడా నమోదైంది.  

ఇదీ చదవండి: బాలీవుడ్‌ తరహా ఈవెంట్లు, లగ్జరీ లైఫ్‌ : 100మందికి పైగా ముంచేసిన ఎన్‌ఆర్‌ఐ జంట

అయితే ఈ ఆరోపణలను సతీష్  ఖండించాడు. అతుల్య మరణంలో తన పాత్ర లేదని పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందంటే తాను నమ్మడం లేదన్నాడు. కాగా యూఏఈ షార్జాలో వరకట్న వేధింపుల కారణంగా కేరళకు చెందిన మహిళ బిడ్డను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది.  జూలై 8న షార్జాలోని అల్ నవ్దాలో 32 ఏళ్ల విపంజిక మణి తన  16 నెలల కుమార్తెను హత్య  చేసి, తాను తనువు చాలించిన సంగతి తెలిసిందే. 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)