అధిక ప్రోటీన్‌ ఆహారంతో జస్ట్‌ 60 రోజుల్లో 22 కేజీలు..! సహాయపడిన డైట్‌ ఇదే..

Published on Sat, 08/01/2026 - 09:22

బరువు తగ్గడంలో సత్వర ఫలితాలు కోసం క్రాష్‌ డైట్‌లు జోలికిపోకుడండా పలువురు క్రమశిక్షణతో కూడిన జీవినశైలితో అమాంతం స్మార్ట్‌గా మారి ఆశ్చర్యపరుస్తున్నారు. కొందరు స్ట్రిక్ట్‌ డైట్‌ల జోలికపోకుండా చేస్తే..కొందరు కఠినమైన డైట్‌లతో కడుపు నిండిన అనుభూతికి ప్రాధాన్యత ఇస్తూ కిలోల కొద్దీ బరువు తగ్గి చూపిస్తున్నారు. అలాంటి కోవ​కు చెందిన వాడు ఈ వ్యాపారవేత్త. జస్ట్‌ నెల రోజుల్లోనే 22 కేజీల పైనే బరువు తగ్గడం విశేషం. ఆ వెయిట్‌లాస్‌ జర్నీలో హెల్ప్‌ అయిన ఆహార పదార్థాల గురించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఆయనే కేరళకు చెందిన వ్యాపారవేత్త డాక్టర్‌ షిబిన్‌ మాథ్యు. ఒకప్పుడు దాదాపు 110 కేజీల బరువు ఉండేవారు. కఠినమైన దినచర్య, పటిష్టమైన ఆహార ప్రణాళిక, జీవనశైలి మార్పులు చక్కటి పరివర్తనకు దారితీస్తాయని అన్నారు. క్రమశిక్షణ సవ్యంగా ఉంటే దాని ఫలితమే చెబుతుందని అంటున్నారు. సరైన ఆహార ప్రణాళిక, చక్కటి జీవనశైలి మార్పులు మంచి రూపుకి దారితీస్తుందని నమ్మకంగా చెప్పారు. తనకు బరువు తగ్గడంలో సహాయపడిన రోజువారి అధిక ప్రోటీన్‌ ఆహారం గురించి ఇలా చెప్పుకొచ్చారు.  

బరువు తగ్గడానికి రోజువారీ ఆహారం
ఆయన తన రోజును ఒక కప్పు కాఫీ, రెండు గుడ్లు, మిరప నూనెతో కలిపిన రెండు స్కూప్‌ల అధిక ప్రోటీన్ పెరుగుతో ప్రారంభిస్తారు. ఈ భోజనం కడుపు నిండిన అనుభూతిని కలిగించి, జీవక్రియను పెంచడానికి తోడ్పడుతుంది.  అధిక ప్రోటీన్ ఆహారాలు, కెఫిన్,  కారమైన కొవ్వులను మిళితం చేస్తుంది. ఈ అల్పాహారం  రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచి, ఉదయం పూట వచ్చే నీరసాన్ని నివారిస్తుంది.

మధ్యాహ్న భోజనానికి, మాథ్యూ ఎక్కువగా ఒక చికెన్ బ్రెస్ట్‌తో పాటు ఒక గుడ్డు, ఒక స్కూప్ అధిక ప్రోటీన్ ఉన్న పెరుగు తీసుకునేవాడు. సలాడ్ల కోసం, అతను తాజా దోసకాయలను ఎంచుకున్నాడు. ఈ కలయిక కడుపు నిండుగా ఉంచడానికి అవసరమైన లీన్ ప్రోటీన్‌ను అందిస్తుంది.

బరువు తగ్గడానికి సహాయపడటానికి, ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, అధిక నీటి శాతం ఉన్న తక్కువ కేలరీల కూరగాయలు కూడా ఉంటాయి. శాకాహారులైతే  గుడ్లకు బదులుగా అర కప్పు గట్టిగా, ముక్కలుగా చేసి, పెనంపై వేయించిన టోఫును, చికెన్‌కు బదులుగా మసాలాలతో కాల్చిన టెంపే లేదా సీటాన్‌ను తీసుకోవడం మంచిదని సూచించారు.

మధ్యాహ్న భోజనం తర్వాత అతను సాధారణంగా తక్కువ మోతాదులో ఆహారం తీసుకునేవాడినని అన్నారు. రాత్రి పడుకునే ముందు, అతను ఒక కప్పు కాఫీ.ఒక ఆపిల్‌కు మాత్రమే పరిమితమైనట్లు తెలిపారు.

తన కఠినమైన డైట్ దినచర్య గురించి వివరిస్తూ అతను ఇలా అన్నాడు, కఠినమైన ఆహార లోటు, అధిక ప్రోటీన్ తోపాటు సాకులకు తావివక్కపోతే..కచ్చితంగా బరువు తగ్గుతారు. నిర్దిష్ట లక్ష్యాల కోసం తీవ్రమైన ఆహార కోత తప్పనిసరని అంటున్నారు.

అలాగే ఏ డైట్ రొటీన్‌ను గుడ్డిగా అనుసరించవద్దని, తమ శరీరం చెప్పేది వినాలని హెచ్చిరిస్తున్నారు. అంతేగాదు ఇలాంటి తీవ్రమైన ఆహార నియమాన్ని ప్రారంభించే ముందు నిపుణులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు కూడా.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

 

(చదవండి: Ravi Kishan Weight Loss: ‘మద్దాలి శివారెడ్డి’గా అలరించిన రవికిషన్‌ వెయిట్‌లాస్‌ జర్నీ..! ఓమాడ్‌తో ఏకంగా 18 ​కేజీలు..)

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)