Breaking News

16 ఏళ్ల చిన్నవాడితో ప్రేమ, సప్త సముద్రాలు దాటి పెళ్లి : వైరల్‌ లవ్‌ స్టోరీ

Published on Fri, 07/18/2025 - 13:19

"మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్" అంటే ఇదేనేమో. ఒక అమెరికా మహిళ వేల మైళ్ల దూరంలో ఉన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.   సప్తసముద్రాలు దాటి అదీ తన కన్నా చిన్నవాడైన వ్యక్తిని మనువాడింది. ప్రేమకు సరిహద్దులు..అవధులు లేవు అని నిరూపించిన ఆ  ప్రేమ జంట గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన మిండీ రాస్ముస్సేన్ (Mindy Rasmussen, 47) , అప్పర్ దిర్ జిల్లా నివాసి  31 ఏళ్ల ఫేస్‌బుక్ ప్రేమికుడు సాజిద్ జెబ్ ఖాన్‌ను ప్రేమించింది.  ప్రియుడ్ని పెళ్లాడేందుకు  ఏకంగా అమెరికా నుంచి పాకిస్తాన్‌కు వెళ్లింది. అంతేకాదు ఇస్లాంలోకి మతం మారింది. మధ్య 16 సంవత్సరాల వయస్సు తేడా స్పష్టంగా ఉన్నప్పటికీ, ఈ నెల ప్రారంభంలో సాంప్రదాయ నిఖా వేడుకలో వివాహం చేసుకున్నారు.  సామాజిక విమర్శలను పట్టించుకోలేదు.  ప్రస్తుతం ఆ జంట ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా  అందరి హృదయాలను గెలుచుకుంటోంది.

ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!

ఫేస్ బుక్‌ పరిచయం
స్థానిక మీడియా కథనాల ప్రకారం దాదాపు ఒక సంవత్సరం క్రితం ఫేస్‌బుక్ ద్వారా ఆన్‌లైన్‌లో పాకిస్తాన్‌కు చెందిన సాజిద్ జెబ్ ఖాన్‌  పరిచయం ఏర్పడింది. మొదట్లో  అందరిలాగానే  మామూలుగా మాట్లాడుకునే వారు. అది కాస్తా సుదీర్ఘ వీడియో కాల్స్‌గా మారింది. ఈ క్రమంలోనే వారిద్దరి  మధ్య ప్రేమ చిగురించింది. ముందుగా రాస్ముస్సేన్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అటు వీరి ప్రేమకు ఇరు కుటుంబాలూ అంగీకారం తెలిపాయి. ఈ నెల ప్రారంభంలోనే 90 రోజుల వీసా గడువుతో రాస్ముస్సేన్ అమెరికా నుంచి ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Islamabad International Airport) వచ్చింది. ఆమెకు ప్రేమగా స్వాగతం తెలిపిన సాజిద్ జెబ్ ఖాన్ స్వగ్రామానికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు కూడా సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. ఇస్లాం మతాన్ని స్వీకరించి ‘జులేఖ’గా పేరు మార్చుకుంది.  ఆ తరువాత  కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో  నిఖా చేసుకున్నారు.  తమ నిఖా వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రాస్ముస్సేన్ తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకుంది.  దీంతో ఈ లవ్‌స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)