Breaking News

Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా?

Published on Tue, 06/17/2025 - 18:15

కేవలం ఆసనం లేదా ధ్యానం చేయడం మాత్రమే కాదు. యోగా  సాధన (Yoga Practicing) చేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  మనస్సు, శరీరం ,ఆత్మను అనుసంధానించే ఒక మార్గం. శరీరాన్ని అంతర్గతంగా పునరుజ్జీవింపజేయడానికి , బాహ్య ప్రపంచంలో ఉన్న కఠినమైన పరిస్థితులను తట్టుకుని పోరాడేంత బలంగా చేస్తుంది యోగా.  శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాదు,  మానసికంగా  ఎంతో దృఢంగా  ఉండొచ్చు. చిన్నవయసువారినుంచి పండు వయసు వారిదాకా సులభంగా  ఆచరించే వ్యాయామం యోగ. యోగా అనేది ప్రాథమికంగా ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ, ఇది మనస్సు  శరీరం మధ్య సామరస్యాన్ని  పెంచుతుంది. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా టిప్‌ ఆఫ్‌ ది డేలో భాగంగా యోగా ఆరోగ్య ప్రయోజనాలు, చిట్కాలు   గురించి తెలుసుకుందాం.
 

యోగా - ప్రయోజనాలు

  • శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా తయారవుతాం
  • క్రమశిక్షణ, ఏకాగ్రత  పెరుగుతుంది.ఒత్తిడి దూరమవుతుంది. 
  • భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి యోగా  చక్కటి పరిష్కారం మానసిక ఆరోగ్యం బలపడుతుంది.
  • యోగా ద్వారా అధిక బరువును సులభంగా తగ్గవచ్చు.
  • యోగా చేయడం ద్వారా మధుమేహం,థైరాయిడ్, మెదడు పనితీరును  మెరుగుపడుతుంది.
  • రక్త పోటు నియంత్రణలో ఉంటుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • కీళ్ల నొప్పులు, అజీర్ణం, గ్యాస్‌, నిద్రలేమి తదితర సమస్యలనుంచి దూరం కావచ్చు.
  • దీర్ఘకాలిక వెన్నునొప్పిని తగ్గిస్తుంది. కండరాలు , ఎముకలు బలపడతాయి.  

చిట్కాలు: 
యోగా సాధనలో బాడీని మనసును రిలాక్స్‌డ్‌గా ఉంచుకోండి.  
ఆరోగ్యంగా , సమయం ప్రకారం తినండి. తాజా పండ్లు, ఆరోగ్యకర పానీయాలు సేవించండి.
యోగా ,ధ్యానం చేసినప్పుడు ఎలాంటి ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేయకుండా చూసుకోండి. 
మీ శరీర పరిమితులను అర్థం చేసుకోండి. సానుకూల ధోరణిని అలవర్చుకోండి.
నిష్టగా, నిబద్ధతతో సాధన చేయండి.  ఉత్తమ ఫలితాలు సాధించండి.

చదవండి: కూతురి వెర్రి పని... సూపర్‌ డాడీ సాహసం, వైరల్‌ వీడియో
 

నోట్‌ : కొన్ని రకాల యోగాసనాలు  నిపుణుల పర్యవేక్షణలోనే సాధన  చేయాలి. అలాగే గుండెజబ్బులు, ఆస్త్మా,  మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు కొన్ని ఆసనాలకు మాత్రమే పరిమితం  కావాల్సి ఉంటుంది.యోగా నిపుణుడు ద్వారా నియమ,నిబంధనలపై అవగాహన పెంచుకుని యోగా సాధన మొదలు  పెట్టండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి!!
 

ఇదీ చదవండి: Air India Incident భారీ విరాళం ప్రకటించిన యూఏఈ వైద్యుడు
 

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)