Breaking News

పరాభవ నామ సంవత్సరం పసందుగా అవార్డుల ప్రదానోత్సవం

Published on Fri, 03/20/2026 - 05:17

తెలుగువారి సంవత్సరాది ఉగాది సినీ ప్రేమికులకు కొత్త హుషారునిచ్చింది... అవార్డులు అందుకున్న వేళ తారల మనసులు మురిసిన వేళ... అభిమానులకు ఆనంద హేల... గురువారం ఉగాది పర్వదినాన హైదరాబాద్‌ హైటెక్స్‌ వేదికగా ‘తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డు’ల వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకలో నాటి తారలు సావిత్రి, శ్రీదేవి, సౌందర్యలకు నివాళిగా నేటి తార నిధీ అగర్వాల్‌ చేసిన డ్యాన్స్‌ ఓ హైలైట్‌... వేదికపై దేవిశ్రీ ప్రసాద్‌ ఎనర్జిటిక్‌ పర్ఫార్మెన్స్‌... లవ్‌ సాంగ్స్‌ నుంచి మాస్‌ సాంగ్స్‌ వరకూ శ్రేయా ఘోషల్‌ పాడిన పాటలు... సింగర్‌ మంగ్లీ పాడిన పాటలు...  ఇలా వీనుల విందుగా, తారల తళుకులతో కనువిందుగా జరిగింది  ‘తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డు’ల వేడుక. ఆ విశేషాలు...

అవార్డుల విషయంలో పక్క రాష్ట్రం వెనుకంజలో ఉంది
తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్‌’కి మూలం అయినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిగారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కగారికి, మంత్రి జూపల్లిగారికి, అలాగే కమల్‌హాసన్ గారికి, నాగార్జునగారికి, జయసుధగారికి, నాగచైతన్య, రష్మికా మందన్నాతో పాటు ఇతర అవార్డుగ్రహీతలందరికీ స్వాగతం పలుకుతున్నాను, అభినందనలు చెబుతున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవింపబడతారో అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. ఈ మాటల ఆదర్శంతో ఆగిపోయిన ఈ అవార్డుల పంపిణీకి పునరుజ్జీవం పోసిన రేవంత్‌ రెడ్డిగారికి ధన్యవాదాలు. 

ఇటీవల జరిగిన గ్లోబల్‌ సమ్మిట్‌కి తెలంగాణ ప్రభుత్వం సినిమా వారిని ఆహ్వానించి, సినిమా అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించడం, సినిమాకి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యతకి థ్యాంక్స్‌. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వేవ్స్‌’ కార్యక్రమంలో నన్ను, కమల్‌హాసన్  వంటి వాళ్లని భాగస్వామ్యం చేయడం సంతోషం. సినిమానే కదా అనే చిన్నచూపు చూడకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవచ్చు. హాలీవుడ్‌ సినిమా అంటే అమెరికా గుర్తొస్తుంది. ఈరోజు ఇండియన్  సినిమా అంటే హైదరాబాద్‌–తెలంగాణ గుర్తుకు రావాలనే ముఖ్యోద్దేశంతో రేవంత్‌ రెడ్డిగారు చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి మనందరం చేదోడు వాదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీవైపు ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. 

పక్కనే ఉన్న మన తెలుగు రాష్ట్రం కళాకారుల పట్ల, సినిమాల పట్ల, వాళ్లని ఉత్సాహపరిచే విధానంలో కొంచెం వెనుకంజలో ఉందనుకుంటున్నాను కాబట్టి సినిమా వాళ్లకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు తెలంగాణ అవార్డులను స్ఫూర్తిగా తీసుకుని, మరింత ప్రోత్సహిస్తే కనుక ఎంతో మంది యంగ్‌స్టర్స్‌ మరిన్ని సినిమాలు చేస్తారు. రాష్ట్రానికి సినిమా రెవెన్యూ కూడా సమకూరుతుంది. సీనియర్స్‌కి గౌరవం ఇచ్చే విధంగా, యంగ్‌స్టర్స్‌కి స్ఫూర్తినిచ్చేలా ఈ అవార్డుల ఎంపిక జరిగింది. ఇందుకు జ్యూరీకి అభినందనలు.
– చిరంజీవి (ఎన్టీఆర్‌ జాతీయ అవార్డుగ్రహీత)

హద్దులు చెరిపేసినందుకు ధన్యవాదాలు
మై ఫ్రెండ్‌ చిరంజీవిగారు... బ్రదర్‌ నాగార్జునగారు. నా ఫ్యామిలీ... చెన్నైలో ఎవరైతే ఉంటారో... వారందరూ ఇక్కడ ఉన్నారు. 16 సంవత్సరాల వయసులో తొలిసారి నేను ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా హైదరాబాద్‌కు వచ్చాను ఏయన్నార్‌గారి ‘శ్రీమంతుడు’ సినిమా కోసం. అందుకే నా ‘దశావతారం’ సినిమాలో ‘ఎంతో చిన్నది జీవితం’ అనే పాట వినిపిస్తుంది. అలా అప్పట్నుంచి నేను హైదరాబాద్‌లో పని చేస్తున్నాను. కొంత సమయం కిందట నేను సింగీతంగారి అవార్డు అందుకున్నాను. అప్పుడు ఆయనతో నేను చేసిన తొలి సినిమా ‘సొమ్ము ఒకడిది... సోకు ఒకడిది’ గుర్తొచ్చింది. పని మొత్తం ఆయన చేశారు. అవార్డు నేను అందుకున్నాను. సింగీతంగారితో నేను 50 సంవత్సరాలుగా కలిసి పని చేస్తున్నాను. మా నాన్నగారి పేరు శ్రీనివాసన్‌ కనుక... సింగీతం శ్రీనివాసరావుగారంటే నాకు ఇష్టం అని కాదు. 

నా సినిమా కెరీర్‌లో నేను కలిసిన యంగస్ట్‌ సీనియర్‌ ఆయన. సింగీతంగారికి అవార్డును అందించినందుకు ధన్యవాదాలు సార్‌ (ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఉద్దేశిస్తూ...). నా బ్రదర్‌... చిరంజీవిగారు. సినిమాల్లో నా జూనియర్‌. పాలిటిక్స్‌లో సీనియర్‌. 1970లో మేం లీడ్‌ రోల్స్‌ చేశాం. ఇప్పుడు 70స్‌లోనే ఉన్నాం. నీ మనసు గురించి కాదు... నీ వయసు గురించి (నవ్వుతూ). గద్దర్‌గారి లక్షల అభిమానుల్లో నేను ఒకడిని. రచయిత, విప్లవకారులు అయిన గద్దర్‌గారి పేరిట అవార్డు ఇస్తున్నందుకు ధన్యవాదాలు సార్‌. ఆయన అభిమానులుగా మేం థ్యాంక్స్‌ చెబుతున్నాం. ఇక నో మోర్‌ కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్‌.. ఒకే ఒక సినిమా... ఇండియన్  సినిమా. ఆ హద్దులను మీరు చెరిపేశారు (టీజీఎఫ్‌ అవార్డుల్లో తెలంగాణ ప్రభుత్వం కోలీవుడ్, బాలీవుడ్‌ స్టార్స్‌ని అవార్డుగ్రహీతలుగా, ప్రదానం చేసేవారుగా భాగం చేయడం). భవిష్యత్‌ తరాల కోసం మేం కూడా సపోర్ట్‌గా ఉంటాం. ఈ అవార్డు అందుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. 
– కమల్‌హాసన్  (పైడి జయరాజ్‌ అవార్డుగ్రహీత)

ఏపీలో తెలుగు చిత్రపరిశ్రమ ఉనికిని గుర్తించాలి
నంది అవార్డ్స్‌ ఎప్పుడు ఇస్తారు అని గత 13 ఏళ్లుగా ఇండస్ట్రీ ఎదురు చూస్తున్నా ఇవ్వలేదు. అలాంటిది హీరో కృష్ణగారి అభిమాని రేవంత్‌ రెడ్డిగారు గద్దర్‌ అవార్డులు మేము ఇస్తాం అని చెప్పి, 2025లో ప్రారంభించి అమోఘంగా ప్రదానం చేశారు. ఇప్పుడు కూడా ఆ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. తెలుగు సినిమా ఉనికిని గుర్తించి, గౌరవించి ఇంతమంది కళాకారులను సగర్వంగా గౌరవిస్తున్నందుకు ఆయనకు సెల్యూట్‌. గొప్ప ప్రజా వాగ్గేయకారుడు అయిన గద్దర్‌గారి పేరు మీద అవార్డు ఇస్తున్న రేవంత్‌గారికి సెల్యూట్, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నాకు కాంతారావుగారి అవార్డు ఇచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్ ఆర్‌గార్ల తర్వాత మూడో హీరో కాంతారావుగారు. తెలంగాణ గడ్డ బిడ్డ ఆయన. జానపద హీరో. తెలుగు ఎంజీఆర్‌ ఆయన. ఎలాంటి పాత్ర వేసినా రామారావుగారి తర్వాత మెప్పించిన గొప్ప నటుడాయన. అలాంటి కాంతారావుగారి అవార్డుని నాకు ఇచ్చి, నా జన్మధన్యం చేసిన రేవంత్‌ రెడ్డిగారికి థ్యాంక్స్‌. 

చంద్రబాబునాయుడుగారు... మీకు దండం పెడుతున్నా. మీరు చాలా పెద్దవారు. తెలంగాణలో రేవంత్‌ రెడ్డిగారు దూసుకెళ్లిపోతున్నారు చిత్ర పరిశ్రమని అభివృద్ధి చేసుకుంటూ, గద్దర్‌ పేరిట అవార్డులు ఇచ్చుకుంటూ... ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆంధ్ర రాష్ట్ర ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి, గౌరవించి మీరు కూడా దయ ఉంచి నంది అవార్డులు ఇవ్వండి సార్‌.. ఇండస్ట్రీని ప్రోత్సహించండి.
– ఆర్‌. నారాయణమూర్తి (కాంతారావు అవార్డుగ్రహీత)

ఏయన్నార్‌ అవార్డు అందుకోవడం ఆనందం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కగార్లకు ధన్యవాదాలు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ‘దిల్‌’ రాజు, ప్రియాంక, చిరంజీవి, కమల్‌హాసన్ గార్లతో పాటు... ప్రతి ఒక్కరికీ పేరు పేరు నా నమస్కారాలు. ఏయన్నార్‌గారి అవార్డును అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రిగారికి థ్యాంక్స్‌. ఏయన్నార్‌గారి గురించి చె΄్పాలంటే... ఎంతో చె΄్పాలి. మా తరంలో ఆయనతో ఎక్కువ చిత్రాల్లో నటించాను. 1976 అన్నపూర్ణ స్టూడియోస్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌లో రామానాయుడుగారు నిర్మించిన ‘సెక్రటరీ’ సినిమాతో మా జర్నీ మొదలైంది. అక్కడ్నుంచి ఎన్నో గొప్ప చిత్రాలు... ఎన్నో గొప్ప బ్లాక్‌బస్టర్స్‌. ఆయన ఎంత గొప్ప నటులో నేను చె΄్పాల్సిన అవసరం లేదు. 

ఆయన హీరోగా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వచ్చినప్పుడు...ఆయన అన్నారు.. ‘ఇప్పుడు ట్రెండ్‌ మారిపోయింది కదా... నా స్టైల్‌ను నేను ఏమైనా మార్చుకోవాలా?, యాక్టింగ్‌లో ఏమైనా మార్పు తెచ్చుకోవాలా? నా బాడీ లాంగ్వేజ్‌లో మార్పు రావాలా?’ అని అందర్నీ అడిగేవారు. నన్ను కూడా అడిగారు. అంత గొప్ప నటులు ఆయన. అంత సింపుల్‌గా ఉంటారు. ఆయన్నుంచి మనందరం నేర్చుకోవాలి. నన్ను ఎప్పుడూ లిటిల్‌ ఫ్రెండ్‌ అంటుంటారు. నేను ఆయన లిటిల్‌ ఫ్రెండ్‌నే. ఆయన లెగసీ కంటిన్యూ అవుతోంది. నాగార్జునగారు, సుమంత్, సుశాంత్, అఖిల్‌... ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న నాగచైతన్య. ఏయన్నార్‌ లివ్స్‌ ఆన్ . రేవంత్‌ రెడ్డి గారికి థ్యాంక్స్‌. సీయంగారు గత ఏడాది నాకు చైర్‌పర్సన్ గా అవకాశం కల్పించారు. ఈ ఏడాది ఏయన్నార్‌ అవార్డు వరించింది. నేను శాసన సభ్యురాలిగా ఫస్ట్‌ రాజకీయాల్లోకి ఎంటర్‌ అయినప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ డైనమిక్‌ స్పీకర్‌. తెలంగాణ మూమెంట్‌ సమయంలో హౌస్‌ అడర్జ్‌న్డ్‌ అయినప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి, మాట్లాడేవారు. అసెంబ్లీ విధి విధానాల గురించి చెప్పేవారు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయినందుకు గర్వంగా ఉంది. ఒక పవర్‌ఫుల్‌ ముఖ్యమంత్రిగా ఎమర్జ్‌ అయ్యారు.
– ఏయన్నార్‌ అవార్డుగ్రహీత జయసుధ

ఈ అవార్డు నాకో మోటివేషన్‌
అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పదహారు సంవత్సరాల సినిమా ప్రయాణంలో ముఖ్యమైన గౌరవం... గుర్తింపు ఇది. ఎన్నో థ్యాంక్స్‌ చె΄్పాలి. గద్దర్‌గారు గొప్ప వ్యక్తి. నిజమైన విప్లవకారులు. కుల వివక్షపై వ్యతిరేకంగా, గౌరవం కోసం పోరాడారు. అలాంటి వ్యక్తి పేరిట ఇలాంటి గొప్ప ఇన్షియేట్‌ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిగారికి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ‘దిల్‌’ రాజుగార్లకు ధన్యవాదాలు. ప్రతి సినిమాకు నేను వంద శాతం ఎఫర్ట్స్‌ పెడుతూనే ఉన్నాను. కొన్ని వర్కౌట్‌ అయ్యాయి... మరికొన్ని కాలేదు. ‘తండేల్‌’ సినిమాలో నేను పోషించిన తండేల్‌ రాజు పాత్రను నా మనసులో పెట్టుకునేలా చేసింది. చాలా సంతోషంగా ఉంది. అలాంటి ఎఫర్ట్స్‌కు ఇలాంటి ఓ అవార్డు రావడం నిజమైన గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవార్డు చూస్తుంటే ఇంకా నేర్చుకోవాలని, ఇంకా ఎదగాలని... నటుడిగా ఇంకా కథలు చె΄్పాలని మోటివేషన్ లా ఉంది. అల్లు అరవింద్‌గారికి, వాసు, చందు మొండేటి, దేవిగారు, సాయి పల్లవి, నవీన్ నూలి, కార్తీక్‌ ఘట్టమనేని, శేఖర్‌ మాస్టర్, సుప్రీమ్‌ మాస్టర్, కార్తీక్‌ తీడ... ఇలా ‘తండేల్‌’ సినిమాలోని అందరికీ థ్యాంక్స్‌. మీ అందరి ఎఫర్ట్స్‌ లేకుంటే ఇక్కడ అవార్డు తీసుకుని ఉండేవాడిని కాదు. నా పిల్లర్స్, నా స్ట్రెంత్‌... మా అమ్మా నాన్న. అలాగే శోభిత... అభిమానులందరికీ ‘ఈపాలి యేట గురి తప్పేదేలేదేస్‌... ఇక రాజులమ్మ జాతరే’.
– నాగచైతన్య (ఉత్తమ నటుడు – ‘తండేల్‌’)

ఈ అవార్డు మరింత నమ్మకాన్నిచ్చింది
అందరికీ హాయ్‌.. హ్యాపీ ఉగాది. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. రేవంత్‌ సార్‌... ఈ అవార్డును మీ చేతుల మీదుగా అందుకోవడం వెరీ వెరీ స్పెషల్‌. భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, దిల్‌ రాజు సార్లకు, హోల్‌ జ్యూరీ కమిటీకి థ్యాంక్స్‌. ఒకప్పుడు నా నటనపైన నేను ట్రోల్స్‌ ఎదుర్కొన్నాను. కానీ, ఈరోజు నా నటన నచ్చి రాష్ట్ర స్థాయి అవార్డు ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే నేను చాలా కాలం ఇండస్ట్రీలో ఉంటాననుకుంటున్నాను. ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ లాంటి సినిమాకి అవార్డు రావడం చాలా ప్రత్యేకం. పైగా ఇలాంటి సినిమాలు మరిన్ని నిర్మించే నమ్మకాన్ని ఇచ్చింది. నన్ను భూమా పాత్రలో అద్భుతంగా చూపించిన రాహుల్‌ రవీంద్రన్ కి థ్యాంక్స్‌. దీక్షిత్, ధీరజ్‌ సార్, విద్య మేడం, గీతా ఆర్ట్స్‌కి థ్యాంక్స్‌. చాలా సంవత్సరాల క్రితం నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక కూతురుగా భావించి ప్రేమ ఇచ్చారు. ఈ రోజు కోడలిగా మీ ముందు నిల్చున్నాను... ఇది చాలా గర్వంగా ఉంది. మీ ప్రేమకు ధన్యవాదాలు.. 
– రష్మికా మందన్నా, (ఉత్తమ నటి, ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’)

అవార్డు విజేతలు
ఉత్తమ నటుడు – నాగ చెతన్య (తండేల్‌)
ఉత్తమ నటి – రష్మికా మందన్న (ది గర్ల్‌ ఫ్రెండ్‌)
ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్‌ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం – ది ప్రీ వెడ్డింగ్‌ షో 
నేషనల్‌ ఇంటిగ్రిటీ సినిమా – తండేల్‌
ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వా
ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్‌ – లిటిల్‌ హార్డ్స్‌
ఉత్తమ వినోదాత్మక చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ చిత్రం – కోర్టు 
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ మూవీ – మిరాయ్‌
ఉత్తమ బాలల చిత్రం – అనగనగనా
ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్‌ రాంబాయి)
ఉత్తమ సహాయ నటుడు – శివాజీ (దండోరా)
ఉత్తమ సహాయ నటి– భూమిక (యుఫోరియా)
ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్‌ కె. రాబిన్ (దండోరా)
ఉత్తమ నేపథ్య గాయకుడు – అనురాగ్‌ (రాజు వెడ్స్‌ రాంబాయి)
ఉత్తమ నేపథ్య గాయని – సాహితి చాగంటి (కన్నప్ప)
ఉత్తమ హాస్యనటుడు – కృష్ణ తేజ (జిగ్రీస్‌)
ఉత్తమ బాలనటుడు – రోహన్‌ రాయ్‌ (ప్రీ వెడ్డింగ్‌ షో)
ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్‌ (యుఫోరియా)
ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్‌ – అనిల్‌ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్‌ (కుబేర)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ – కార్తీక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)
ఉత్తమ ఎడిటర్‌ – శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌) 
ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ – ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ (కిష్కిందపురి)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌ – గిర గిర గిర (ఛాంపియన్‌)
ఉత్తమ ఆర్ట్‌ డైరక్టర్‌ – తోట తరణి (ఛాంపియన్ )
ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌ – గోవింద్‌ (అఖండ)
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ – చంద్రకాంత్‌ (చంద్రకాంత్‌)
ఉత్తమ స్పెషల్‌ జ్యూరీ ఫిల్మ్‌ – 23
ఉత్తమ మేల్‌ యాక్టర్‌ – చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్‌ రాంబాయి)
ఉత్తమ నటి – అనంతిక (8 వసంతాలు)
స్పెషల్‌ జ్యూరీ హీరో – రోషన్ (చాంపియన్ )

 

Videos

YSRCP బూత్ కమిటీ సమావేశం.. నేతలకు RK రోజా సూచన

నో స్టాక్.. పెట్రోల్ బంకులు క్లోజ్

నారా కాస్త నీరో లోకేష్ అయ్యాడు..లోకేష్ పై నిప్పులు చెరిగిన తాటిపర్తి

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

భారీగా పతనమైన రూపాయి విలువ

ఫైనల్ షాట్..హర్మూజ్ లోనే అమీ తుమీ

మీరు చేస్తే సంసారం.. పక్కవాడు చేస్తే వ్యభిచారం పోలీస్ వ్యవస్థ, చంద్రబాబు పై జాడ శ్రవణ్ నిప్పులు

విమానంలో 11 ఏళ్లుగా పలు సాంకేతిక సమస్యలున్నాయి

కాంగ్రెస్ సర్కార్ రోజుకో స్కాం అసెంబ్లీలో మొత్తం బయటపెడతా

మాతో పెట్టుకోవద్దు.. పాక్‌కు ఆఫ్ఘన్ ప్లేయర్ వార్నింగ్

Photos

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)

+5

శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

పేరేంట్స్‌గా మాకు గర్వకారణం.. కుమారుడి ఈవెంట్‌లో శివబాలాజీ దంపతులు (ఫొటోలు)

+5

టాలీవుడ్ జంట కిరణ్ అబ్బవరం- రహస్య ఉగాది వేడుకలు (ఫొటోలు)

+5

ఉగాది స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ ఇలా (ఫొటోలు)

+5

పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో వైఎస్‌ జగన్‌ దంపతులు (ఫొటోలు)

+5

విజయవాడ : సెలవులు, పండుగ వచ్చేసింది.. బస్టాండ్‌లో విద్యార్థులు, ప్రయాణికుల రద్దీ (ఫొటోలు)